25.2 C
Hyderabad
October 15, 2024 12: 18 PM
Slider కడప

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

tdp kadapa

వైకాపా ఆరునెలల పాలనంతా కూల్చివేతలు, దౌర్జన్యాలు, తెదేపా నేతలపై కేసుల పెట్టి బెదిరించడంతోనే సరిపోయిందని చంద్రబాబు ఆక్షేపించారు. తమ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనే ధైర్యం తమకు ఉందని చెప్పారు. ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై 51 కేసులు నమోదు చేశారని వివరించారు. తెదేపాను అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తాము కూడా గత ఐదేళ్లలో కక్ష పూరితంగా వ్యవహరించి ఉంటే ఒక్క వైకాపా కార్యకర్త కూడా మిగిలేవాడు కాదని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వ పాలన తిరోగమనం వైపు సాగుతోందని.. కేవలం పులివెందుల, పుంగనూరుకు మాత్రమే నిధులు విడుదల చేస్తే మిగిలిన 173 నియోజకవర్గాల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని.. ఎప్పుడూ ఇదే ప్రభుత్వం ఉంటుందనే భ్రమలు వీడాలని హితవు పలికారు

Related posts

ఘనంగా జరిగిన మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు

Satyam NEWS

గుడిసెలు తగలబె ట్టిన వారిని వెంటనే శిక్షించాలి: సీపీఎం డిమాండ్

Satyam NEWS

జిహెచ్ఎంసి అధికారులపై రేవంత్‌రెడ్డి సీరియస్

Satyam NEWS

Leave a Comment