30.2 C
Hyderabad
October 13, 2024 16: 33 PM
Slider ప్రత్యేకం

అమరావతి రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్

#chandrababunaidu

అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ త్వరలో చెల్లించనుంది. కౌలు నిమిత్తం ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. దాన్ని  రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)కి విడుదల చేస్తూ శుక్రవారం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.

అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇవ్వనున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట టీడీపీ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగిసిపోయింది.

అందుకే దీన్ని మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో అమరావతి రైతుల ఖాతాల్లో నేరుగా ఈ కౌలు మొత్తం జమ కానుంది. గతంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదేళ్లుగా ప్రతి ఏడాదీ కౌలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నేరుగా కౌలు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అమరావతి రైతులుక ఇవ్వాల్సిన వార్షిక కౌలును విడుదల చేస్తామని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ప్రకటించగా.. తాజాగా ఓటాన్ అకౌంట్లో నిధులు కూడా కేటాయించారు.

ఇంకో రెండు మూడు రోజుల్లో లబ్ధి దారుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఎన్నో ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాశ్వత సచివాలయం, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు భవనాలను ఐకానిక్ బిల్డింగులుగా, మంత్రులు, విభాగాధిపతుల బంగ్లాలు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాలకు నిర్మాణాలను మొదలు పెట్టింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ పనుల్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడి రాష్ట్ర పురోగతిని తిరోగమించేలా చేశారు.

Related posts

వాటెడ్ జస్టిస్: చిరువ్యాపారుల పొట్ట కొడితే ఎలా?

Satyam NEWS

అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

Satyam NEWS

భవిష్యత్తు తరాల కోసం వైఎస్ షర్మిల కు అండగా ఉందాం

Satyam NEWS

Leave a Comment