మూడురాజధానుల వివాదం లో భాగం గా సంక్రాంతి సంబరాలు అమరావతిలో నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ లో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాం లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపాల్గొన్నారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ నివేదిక ప్రతులను భోగిమంటల్లో వేసి వారు నిరసన తెలిపారు.
ఆంధ్రులంతా ఒక్కేటే రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి గద్దె రామ్మోహన్‌రావు, దేవినేని ఉమ, కేశినేని నాని, పర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, బోడె ప్రసాద్, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, ఐకాస కన్వీనర్ ఆళ్ల శివారెడ్డి, కోకన్వీనర్లు గద్దె తిరుపతిరావు, ఆర్.ఎల్.స్వామి, కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జనసేన నాయకురాలు రజని, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ హాజరయ్యారు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ నివేదిక ప్రతులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు.
తుళ్లూరులో మహాధర్నా శిబిరం వద్ద బోగీమంటల కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీఎన్ రావు, బోస్టన్, హైపవర్ కమిటీ పత్రాలను బోగిమంటల్లో వేసి నేతలు నిరసన తెలిపారు.