ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జాతీయ మీడియాలో ఎంతటి ఆదరణ, పాపులారిటీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన ఢిల్లీలో అడుగుపెట్టారంటే సీనియర్ జర్నలిస్టులు సైతం ఇంటర్ వ్యూ కోసం పోటీలు పడుతుంటారు.. 90 దశకం చివరలో, మిలీనియం ప్రారంభంలో చంద్రబాబు హస్తిన వెళ్లారంటే అదో క్రేజ్.. ఆయన కోసం మీడియా క్యూ కడుతుంది.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.. దీంతో, మరోసారి జాతీయ మీడియా ఆయన జపం చేస్తోంది… ఆయనని ఆకాశానికి ఎత్తుతోంది..
ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి చానెల్…. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్ సదస్సుకి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.. ఈ సదస్సుకి అనేకమంది సెలబ్రిటీలు, లెజెండ్‌లు, పారిశ్రామిక వేత్తలు విచ్చేశారు.. ఈ కాంక్లేవ్‌లో ఏపీ సీఎం చంద్రబాబుపై పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా, చంద్రబాబుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పోర్ట్స్‌కి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతని, హైదరాబాద్‌ని స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా మార్చిన తీరుని మెచ్చుకున్నారు.. ఆయన తనకి నాడు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇచ్చారని గుర్తు చేశారు సానియా మీర్జా..
చంద్రబాబు విజన్‌పై ప్రత్యేక చర్చ జరిగింది ఈ కాంక్లేవ్‌లో.. 90వ దశకంలో చంద్రబాబు హైదరాబాద్‌ని ప్రపంచ డెస్టినేషన్‌గా మార్చడంలో ఎంతో కృషి చేశారని, ఆయన ప్రయత్నంతో నేడు టాప్ నగరంగా అవతరించిందని తెలిపారు వ్యాఖ్యాతలు.. నేడు అమరావతిని గ్రీన్ ఫీల్డ్ నగరంలా తీర్చిదిద్దడంలో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దూరదృష్టి, 35 వేల ఎకరాల సమీకరణకు రైతులు బాబు బ్రాండ్‌ని నమ్మిన తీరుపై ప్రత్యేక చర్చ జరిగింది..
జాతీయ రాజకీయాలలో చంద్రబాబు స్థానం ప్రత్యేకమని వివరించారు.. 20 ఏళ్ల కిందట జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించారని, ఇటు ఐటీకి ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంతోపాటు విజన్ 2020తో దేశంలో ముఖ్యమంత్రుల మధ్య పోటీని పెంచారని, డెవలప్ మెంట్స్ పాలిటిక్స్‌కి ఆయనే ఆద్యుడు అని ఆకాశాకిని ఎత్తారు వ్యాఖ్యాతలు.. నాడు ఐటీని పెంచి పోషించిన చంద్రబాబు, నేడు ఏఐకి పెద్దపీట వేస్తున్నారని రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పలువురు అభిప్రాయ పడ్డారు.. మొత్తమ్మీద, జాతీయ స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రికి భారీ స్వాగతం లభించింది.. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ దక్కని గౌరవం ఇది…