29.2 C
Hyderabad
October 13, 2024 15: 11 PM
Slider ఆంధ్రప్రదేశ్

కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు

chandrababu office

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భవనేశ్వరి ప్రారంభించారు. తొలుత చంద్రబాబు, భువనేశ్వరి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు.

ప్రధాన ద్వారం ముందు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయం ఇక టీడీపీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. మూడు బ్లాక్‌ల నిర్మాణంలో అందుబాటులోకి మొదటి బ్లాక్‌ నిర్మాణం చివరి దశలో ఉంది. 75వేల అడుగులతో జీప్లస్‌-3గా మొదటి బ్లాక్‌ నిర్మాణం ఉంది.

మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేష్‌ ఛాంబర్స్‌ని ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియా రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్‌ రూమ్‌లు కేటాయించారు. ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు అదే విధంగా జిల్లాల అధ్యక్షులకు మంత్రులు, క్యాబీన్ ఏర్పాటు చేశారు.

టీడీపీ మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, చైర్మన్ లు, ఇంచార్జిలు ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలతో అదినేత చంద్రబాబు ఫోటోలు దిగారు. అనంతరం నేతలు, కార్యకర్తలతో కలిసి భోజనాలు చేశారు.

Related posts

ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు

Murali Krishna

కామవరపుకోట రోడ్డుకు తూట్లు పడ్డాయి

Bhavani

దేశాన్ని ఏకం చెయ్యడమే రాహుల్ యాత్ర లక్ష్యం

Murali Krishna

Leave a Comment