February 28, 2024 08: 17 AM
Slider ప్రత్యేకం

మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ను

#chandrababu

రాష్ట్రంలో మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు…మార్చవలసింది జగన్ ను అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ వలసలు ప్రారంభం అయ్యాయని, జగన్ సినిమా అయిపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకో 3 నెలల్లో ఇంటికి పోతూ…ఇప్పుడు విశాఖ పోతాను అంటున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీలో చేరికలు జరిగాయి.

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చేరికల సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డేలేదు. కృష్ణా నదికి అడ్డుగా కట్టవేసి ఇసుకను దోచేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే రెండు జిల్లాల్లో ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారు. ఇసుక దోపిడీపై ప్రశ్నిస్తున్న వారిపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. పిడి యాక్టు పెట్టి జైల్లో పెట్టారు. ఇసుక దోపిడీ పై ఎవరూ ప్రశ్నించకుండా కేసులు పెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతున్నాను అని చంద్రబాబు అన్నారు.

జగన్ కు సంగతి తెలిసిపోయింది అందుకే 92 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు, ఎమ్మెల్యేలను కాదు…జగన్నే మార్చాలి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆక్వా రైతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నారు. హర్టికల్చర్ రైతులు నాశనం అయ్యారు. ఒక వ్యక్తి విధానాల వల్ల వ్యవస్థలు నాశనం అయితే జీవితాలు నాశనం అవుతాయి. ఈ ఐదేళ్లలో ఇదే జరిగింది. ఒక్క చాన్స్ పాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో నిస్సహాయతలో ఉన్నారు. మన రాత తిరిగి రాసే శక్తి మన చేతుల్లోనే ఉంది అని చంద్రబాబు అన్నారు.

నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ జగన్ లాంటి దారుణమైన సిఎంను చూడలేదు. ప్రతిపక్షాలపై దాడులు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. రేపు జరిగే ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, పేద ప్రజలు ఆలోచించుకోవాలి. నేను అందరి వాడిని ఏ ఒక్కడి వాడిని కాదు. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం చూడడం. తెలుగు వారిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడం నా లక్ష్యం. ఇది సాధ్యం అవుతుంది. నా జీవితానికి ఒక ఆశయం ఉంది. ఒక లక్ష్యం ఉంది. 45 ఏళ్ల అనుభవంతో చెపుతున్నా.. ఇంకా కష్టపడతాను. మీ రుణం తీర్చుకుంటాను. నేను సూపర్ సిక్స్ ఇస్తాను అని ప్రకటించాను అని ఆయన గుర్తు చేశారు.

Related posts

అవినీతి కంపెనీకి అమరావతి పనులు ఎలా అప్పగిస్తారు?

Satyam NEWS

BJP Open letter: 10వ తేదీన కాణీపాకం వస్తావా రాచమల్లూ?

Satyam NEWS

కుండపోత వర్షంతో తిరుమల కొండ ఘాట్ రోడ్డు మూసివేత

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!