27.7 C
Hyderabad
April 18, 2024 08: 43 AM
Slider అనంతపురం

ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో నిలిచిపోయిన డిక్లరేషన్

#chandrababu

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో గెలిచిన టీడీపీ అభ్యర్ధికి డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేయడం అన్యాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు ఆయన లేఖ రాశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచిత చర్యలకు దిగిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలపివేశారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారు.

సిఎం నుంచి, ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇప్పుడు డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి నిబంధనల ప్రకారం వెంటనే డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

ఘనంగా కాటమయ్య పండుగ

Bhavani

మారియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు

Satyam NEWS

ఇళ్లను కాదు ఊళ్లనే కడుతున్నజ‌గ‌న్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment