రివర్స్ టెండింగ్ ద్వారా ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ పెట్టిన తరువాత ఇప్పటికి సుమారు 1000 కోట్లు మిగిలిందని, రాబోయే రోజుల్లో చేపట్టే రివర్స్ టెండరింగ్ లో మరొక 500 కోట్లు మిగులుతాయని ఆయన తెలిపారు. రివర్స్ టెండరింగ్ నిర్వహించక పోతే 1500 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళేవో అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. రేట్లు పెంచి పనులు కాంట్రాక్టర్లు కు ఇవ్వడం మంచిదా లేదంటే రేట్లు తగ్గించి పనులు కాంట్రాక్టర్లు కు ఇవ్వడం మంచిదా? అనే విషయం ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రజాధనాన్ని పదిమంది కాంట్రాక్టర్లుకు కట్టబెట్టాలని చూస్తే అదే ధనాన్ని పేదలకు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని మంత్రి అన్నారు. ఎక్సస్ టెండర్లు నిర్వహించడం ద్వారా చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని మంత్రి తెలిపారు. టెండర్ల లో ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టి చంద్రబాబు తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టారని అవి అన్నీ ఇప్పుడు రివర్స్ అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో కూడా 61 కోట్లు రూపాయాలు మిగిలిందని మంత్రి అన్నారు.
previous post
next post