ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సీఎం చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా వాణిజ్య సముదాయాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీఎం ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య వ్యాపార అనుకూల ప్రభుత్వం ఉందని ఆస్ట్రేలియన్ హై కమిషనర్‌కు తెలిపినట్టు సీఎం పేర్కొన్నారు. ఇటీవల సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలై జాకి, ఇతర ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటి అయ్యారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సీఆర్డీఏ కమిషనర్‌తో కాన్సుల్ జనరల్ చర్చించారు.
previous post
next post