తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. నేడు నందిగామ పర్యటనలో పాల్గొన్న చంద్రబాబునాయుడు కొలికిపూడిని పట్టించుకో కుండానే ముందుకు సాగిపోయారు. అంతే కాకుండా చంద్రబాబు హెలికాప్టర్ దిగి నేతలను పరిచయం చేసుకున్న సందర్భంలో కూడా కొలికేపూడి వైపు సీరియస్ గా చూశారు. అందరి నేతలతో కరచాలనం చేసిన చంద్రబాబు కొలికిపూడితో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. చేసేది లేక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వెనక్కి వెళ్లి నిలబడ్డారు. కొలికిపూడి వ్యవహారం పైన ఇప్పటికే చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. తాజా పరిణామాలతో టిడిపికి కొలికపూడి మరింత దూరం అవ్వడం ఖాయం అని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు.
previous post
next post