28.7 C
Hyderabad
April 25, 2024 04: 43 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఇసుక దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలి

cbn isuka

ఈనెల 14వ తేదీన విజయవాడలో తలపెట్టిన 12గంటల నిరసన దీక్ష సందర్భంగా సోమవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. దీక్షా వేదిక వద్ద ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. అన్ని జిల్లాలనుంచి పెద్దఎత్తున కార్మికులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రానున్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని, వేదిక వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ వసతులు, తాగునీరు,మజ్జిగ పంపిణీ తదితర వసతుల కల్పనపై నాయకులతో ఆయన చర్చించారు. ఇంత పెద్దఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, వైసిపి ప్రభుత్వం గత 5నెలల్లో చేపట్టిన నిర్వాకాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని చంద్రబాబు అన్నారు. ప్రతిరోజూ నలుగురైదుగురు కార్మికులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. చెట్టుకు ఉరేసుకోవడం, ఫ్యాన్ కు ఉరేసుకోవడం, పురుగుమందు తాగి చనిపోవడం వార్తలే పత్రికల్లో, ఛానళ్లలో వస్తున్నాయి. ఈ దుస్థితిని చక్కదిద్దాలంటే తక్షణమే ఆయా కుటుంబాల్లో భరోసా కల్పించాలి. వారికి అండగా ఉన్నామన్న నమ్మకం కల్పించాలి. కార్మికుల కుటుంబాల్లో భవిష్యత్తుపై విశ్వాసం కల్పించేందుకే తాను దీక్ష చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా’’ అందరి నినాదం కావాలి. ఈ దీక్షకు హాజరై సంఘీభావం చెప్పేలా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వారిని ఆహ్వానించాలి. తాపీ మేస్త్రీలు, తాపీ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు,ఎలక్ట్రీసియన్లు..నిర్మాణరంగంలో వివిధ వృత్తుల ప్రతినిధులు హాజరు అయ్యేలా చూడాలి. ఆయా కార్మిక సంఘాల(అసోసియేషన్ల) ప్రతినిధులను భాగస్వాములను చేయాలి. దీక్షా శిబిరంలో వైసిపి నేతల ఇసుక దందాను, శాండ్ మాఫియా అరాచకాలను ఎండగట్టాలి. రాష్ట్రంలో ప్రాణ త్యాగాలు ఆగాలంటే తక్షణమే ఉచిత ఇసుక ఇవ్వాలి. పొరుగు  రాష్టాలకు అక్రమ రవాణా చేసే ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలి. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలి. ఇసుక కృత్రిమ కొరతతో పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం అందించి అండగా నిలవాలి. ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందించాలనేది ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. ఈ భేటిలో టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు, ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్యేలు చినరాజప్ప, బాల వీరాంజనేయ స్వామి, మద్దాలి గిరి, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య, టిడి జనార్దన్, మాల్యాద్రి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో జనసేన జెండా ఎగరాలి

Bhavani

జగనాసుర రక్త చరిత్ర బహిరంగం పుస్తకంతో జనంలోకి ‘దేశం’

Bhavani

కరోనా అదుపునకు ఎంపీ ఆదాల ఆర్థిక సాయం

Satyam NEWS

Leave a Comment