27.7 C
Hyderabad
April 24, 2024 10: 12 AM
Slider సంపాదకీయం

మీడియా మానేజిమెంట్ లో బాబు చాకచక్యం

Chalo Atmakuru

ఛలో పల్నాడు కార్యక్రమానికి పిలుపునివ్వడానికి ముందు వారం రోజుల నుంచే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు మీడియా మానేజిమెంట్ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో దెబ్బ కొట్టడంతో బాటు జాతీయ స్థాయిలో బద్నాం చేయాలన్న ప్లాన్ కు ఆయన తెరతీసి చివరకు సక్సెస్ సాధించారు. చంద్రబాబునాయుడి ప్లాన్ కన్నా వైసిపి చేసిన తప్పిదాలే ఎక్కువగా ఉండటంతో ఆయనకు అదృష్టం కలిసివచ్చినట్లయింది.

ఛలో పల్నాడు కార్యక్రమానికి పిలుపు ఇచ్చే ముందు హైదరాబాద్ లో విజయవాడలో దఫదఫాలుగా జాతీయ మీడియా ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ ముఖ్యులు సమావేశాలు జరిపారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ సమావేశాలను వైసిపి ప్రతినిధులు, బాధ్యులు, ఇంటెలిజెన్సు అధికారులు, మీడియా ప్రముఖులు ఎవరూ కూడా పసిగట్టలేకపోయారు. అందరూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించేవారే తప్ప సరిగా క్షేత్ర స్థాయిలో పని చేసేవారు లేకపోవబంతో వైసిపి ఛలో పల్నాడు కార్యక్రమం సందర్భంగా చతికిలపడింది.

ఎంపిక చేసిన జాతీయ మీడియా ప్రతినిధులను మచ్చిక చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారు. వారికి కావాల్సిన సమాచారాన్ని (తమకు అనుకూలమైన సమాచారాన్ని) వీడియో లతో సహా వారికి ముందే అందించారు. పల్నాడు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చేసిందని చెబుతూ సంఘటనల జాబితా ను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ మీడియాకు ముందే అందించారు.

బాధితుల వివరాలు జరిగినట్లు చెబుతున్న సంఘటనలు అన్నీ ముందే అందడంతో జాతీయ మీడియాకు పరిస్థితి అర్ధం అయింది. దానికి తోడు ఏపి పోలీసుల ఓవర్ యాక్షన్ వారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సమాచారమే కరెక్టు అనే భావన కలిగించింది. పల్నాడులో ఇంత దారుణమైన పరిస్థితులు లేకపోతే ప్రభుత్వం ఎందుకు ఇంతగా స్పందిస్తుందని మాత్రమే జాతీయ మీడియా ప్రతినిధులు అనుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఢిల్లీలో ఒక ప్రముఖ పదవిలో పని చేసిన మాజీ జర్నలిస్టు ఒకరు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు.

ఇంగ్లీష్ ఛానెళ్ల ప్రధాన ప్రతినిధులు విజయవాడలో తిరుగుతున్నా కూడా వైసిపి దృష్టి సారించలేకపోయింది.  ఛలో ఆత్మకూరు కార్యక్రమం ప్రారంభం నుంచే వైసిపి నేతలు తప్పటడుగులు వేశారు. మీడియాకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా కేవలం తాము చెప్పిందే రాసుకోవాలనే రీతిలో వ్యవహరించారు.

పల్నాడులో జరుగుతున్న కార్యక్రమాలను వారు వెల్లడించకుండా తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాలకు ఖండనలు ఇస్తూ పోవడంతో చూసేవారికి, వినేవారికి పల్నాడులో ఏదో జరుగుతున్నదనే అనుమానమే కలిగింది. దాంతో తెలుగుదేశం పార్టీది పైచేయిగా కనిపించింది. జరిగిన వైఫల్యాలను కూడా కప్పిపుచ్చే విధంగా ఇంకా వైసిపి నాయకులు ప్రవర్తిస్తుండటంతో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే ఇలాంటి పనులు సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చేస్తుంది.

మీడియాకు సమాచారం ఇవ్వడం అటుంచి పోలీసులు మీడియా ప్రతినిధులతో వ్యవహరించిన తీరు కూడా తీవ్ర అసహనాన్ని రేపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గానీ ఇతర బాధ్యుల నుంచి గానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా విఫలం అయింది.

Related posts

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్న నామినేషన్ల పర్వం

Satyam NEWS

సరకుల గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన

Satyam NEWS

ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెబుతూ…

Satyam NEWS

Leave a Comment