40.2 C
Hyderabad
April 24, 2024 18: 42 PM
Slider ముఖ్యంశాలు

అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడం దారుణం

#Chandrababunaidu

ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నానని ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యాంటి టైమ్ వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. సాయంత్రం 5గం తర్వాత 4.20గం సమయం వేసి డిశ్చార్ చేయడం దుర్మార్గం. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించక పోవడం గర్హనీయం అని ఆయన విమర్శించారు.

కమిటి పేరుతో డాక్టర్స్ డే రోజునే ఒత్తిళ్లు తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమని, కమిటి ముసుగులో, తప్పుడు నివేదికలతో, ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో  రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, అమానవీయంగా వ్యవహరించింది, మళ్లీ రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం గర్హనీయని చంద్రబాబునాయుడు అన్నారు.

Related posts

నిబంధనలు అతిక్రమించిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి

Satyam NEWS

సైకిల్ దిగిన విశాఖ డెయిరీ

Satyam NEWS

ఎన్నిక‌ల‌కు తెర‌దించిన హైకోర్టు తీర్పు.. ఎన్ఈసీ నిమ్మ‌గ‌డ్డ

Sub Editor

Leave a Comment