33.2 C
Hyderabad
June 17, 2024 16: 16 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

కేసుల్ని పక్కదోవ పట్టించే స్ట్రాటజీ

cb naidu stratagy

పబ్లిక్ లైఫ్ లో ఏదైనా పొరబాటు చేస్తే లేదా జరిగితే దాన్ని సరిదిద్దుకుంటారు ఎవరైనా. అయితే తప్పు జరిగినా, తప్పు చేసినా తనకు సంబంధింత వ్యక్తులు దారుణాలు చేసినా సమర్ధించుకునే వారిని ఏమనాలి? తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు అనాలి. తన పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల నాటికైనా మళ్లీ పార్టీని సన్నద్ధం చేసుకోవాలని కాకుండా ఇంకా భ్రమల్లోనే బతుకుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భ్రమల్లోనే ఉంచుతూ ఎంతో బిజీగా ఉన్నారు చంద్రబాబునాయుడు.

తన హయాంలో స్పీకర్ గా పని చేసిన కోడెల శివప్రసాదరావు ఫర్నీచర్ కొట్టేసి ఇంట్లో పెట్టుకుంటే ఆ విషయం ఎక్కడ పెద్దది అవుతుందోనని చంద్రబాబునాయుడు ఆ రెండు రోజులూ తన ఇంటిపై డ్రోన్ తిరిగిందని, తన ఇంటిని సిఎం జగన్ ముంచేయడానికి చూస్తున్నారని మీడియాలో ఊదరగొట్టారు. ఆయనకు సంబంధించిన మీడియా ఆయన చెప్పిందన్ని హైలైట్ చేస్తుందని ఆయనకు తెలుసు. తద్వారా కోడెల చేసిన రాచకార్యాన్ని విజయవంతంగా పక్కదోవ పట్టించాలనేది చంద్రబాబు వ్యూహం. అదే విధంగా గురజాల మాజీ ఎంఎల్ఏ యారపతినేని అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ విచారణకువచ్చి అరెస్టు చేసే టైమ్ కు సిఎం జగన్ నీళ్లన్నీ సముద్రంలో వదిలేసి రాష్ట్రానకి అన్యాయం చేశారని ప్రచారం పైకి తెచ్చి ప్రజల్ని బిజీగా పెట్టారు.

ఇలా తన పార్టీలోని తన వందిమాగధులు ఎవరు తప్పులు చేసినా అవి మీడియాలో రాకుండా పక్కదోవపట్టిస్తున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారు. తాడికొండ ఎంఎల్ఏ ని కులంపేరుతో దూషించి అవమానించి వినాయకుడి పందిరిలోకి రాకుండా తరిమికొట్టిన ఇష్యూను పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఎస్ సి ఎస్ టి ఎట్రాసిటీస్ కేసు పెట్టిన వారిని బద్నామ్ చేసేందుకు ఆయన వ్యూహం పన్నారు. వైసిపి కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని చంపేస్తున్నారనే వాదన బయటకు తీసుకువచ్చారు.

కులం కావరంతో ఎస్ సి వర్గానికి చెందిన ఒక మహిళా ఎంఎల్ఏ ను దారుణంగా అవమానించిన తెలుగు తమ్ముళ్లను కాపాడుకోవడానికి చంద్రబాబునాయుడు ఈ ఎత్తుగడ వేశారు. వైసీపీ బాధితుల కోసం గుంటూరులో టీడీపీ పునరావాసం ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం ఈ పునరావాస శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘మీకు ధైర్యముంటే నాపై దాడి చేయండి’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలే జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ఇష్టానుసారం చేస్తున్నారని.. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే మీరుండేవారా? అని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఆగ్రహంతో ఊగిపోవడం తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాక ఇంకేమైనా కారణం ఉందా?

Related posts

జనసేవతోనే జనసేన విజయం సాధించడం ఖాయం

Satyam NEWS

కౌలురైతులు సంఘటితం కావాలి

Satyam NEWS

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలి

Satyam NEWS

Leave a Comment