32.2 C
Hyderabad
March 29, 2024 21: 27 PM
Slider ముఖ్యంశాలు

రామతీర్థం పుణ్య క్షేత్రానికి.. టీడీపీ అధినేత…!

#ChandrababuNaidu

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా రామతీర్థం కు రానున్నారు.ఈ మధ్యనే రామతీర్థం బొడికొండపై ఉన్న రాముని శిరస్సు ఖండన అంశం   యావత్ రాష్టాన్ని ఓ కుదుపు కుదిపేసింది.

ఇక గత మూడు రోజుల నుంచీ బీజేపీ నేతలు అక్కడే ఉండి ధర్నా చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్ధానిక ఎమ్మెల్యే ఘటనా స్థలిని పరిశీలించారు. ఇక ధార్మిక సంఘాలు కూడా ఆందోళనలకు దిగారు. పరిస్థితి సీరియస్ గా అవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా రామతీర్థం బొడికొండను సందర్శించనున్నారు.

రాష్ట్ర పరిపాలన విభాగం బాబు టూర్ షెడ్యూల్ ను విడుదల చేసారు. ఈ నెల 2వ తేదీన ఉదయం ఉండవల్లి నుంచీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వాహనంలో వచ్చి నుంచీ హెలికాప్టర్ ద్వారా వైజాగ్ చేరుకుంటారు. అక్కడ నుంచీ రోడ్డు మార్గం ద్వారా రామతీర్థం  చేరుకుని..అక్కడ నుంచీ బొడికొండపై కి నడుచుకుని వెళతారు.

అనంతరం మధ్యాహ్నం రామతీర్థం దేవస్థానాన్ని సందర్శిస్తారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో జిల్లా ఎస్పీ రాజకుమారీ…రామతీర్థం ను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లు ను పర్యవేక్షించారు.కొండ పరిసర ప్రాంతం అంతా పోలీసులు జల్లెడ పడతున్నారు. ఇప్పటికే కొండపై స్పెషల్ పార్టీ ని రంగంలో కి దించారు.

కొండ దిగువన.. ఏఆర్ ,ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసులు దాదాపు ఇరవై మందికి పైగా కాపలా ఉన్నారు.కొండపై నెల్లిమర్ల ఎస్ఐ దామోదర్ ను దిగువన గంట్యాడ ఎస్ఐ ని బందోబస్తు గా పెట్టారు. ఏదైనా రామతీర్థం బొడికొండపై జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Related posts

కరోనాతో కాళేశ్వరం ఆలయంలో దర్శనాలపై ఆంక్షలు

Satyam NEWS

గుర‌జాడ  ఆడిటోరియం…మ్యూజీయం సంగ‌తేంటి..?

Satyam NEWS

చెవిలో పూలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన

Satyam NEWS

Leave a Comment