చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ తీసిన చిత్రాలను ఇస్రో ట్వీట్ చేసింది. ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ఈ చిత్రాలు తీసిందని పేర్కొంది. చంద్రుడిపై నైసర్గిక స్వరూపం అధ్యయనం చేయడానికి ఈ కెమెరా ఎంతో కీలకమని ఇస్రో తెలిపింది. తాజా చిత్రం సెప్టెంబరు 5న చంద్రుడి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆర్బిటర్ తీసిందని వివరించింది. ఈ చిత్రంలో కొన్ని బిలాలను గుర్తించారు. దక్షిణ ధ్రువాన 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతుతో ఉన్న ‘బోగుస్లాస్కై ఈ’ అనే బిలాన్ని గుర్తించింది. ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 1 నుంచి 2 మీటర్ల ఎత్తున బండరాళ్లను ఇస్రో గుర్తించింది
previous post
next post