40.2 C
Hyderabad
April 19, 2024 15: 53 PM
Slider ప్రత్యేకం

మార్చాల్సింది మంత్రుల్ని కాదు జగన్ ను

#navataramparty

తెరపైన ఎవరున్నా తెర వెనుక మనుషులు మాత్రం వారేనని రాష్ట్ర కొత్త మంత్రి వర్గంపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శలు గుప్పించారు. పాత మంత్రులతో పాత చింతకాయ పచ్చడిలా జగన్ కేబినెట్ ఉందని, జగన్మోహన్ రెడ్డి నూతన మంత్రివర్గ కూర్పు కిచెన్ కేబినెట్ లా ఉందని, అసలు మార్చాల్సింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయనకు సలహాలు ఇచ్చేవారిని కానీ మంత్రివర్గాన్ని కాదు అని ఆయన అన్నారు.

చిలకలూరిపేట లోని నవతరంపార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 మంది కొత్త మంత్రుల వల్ల బారికేడ్లు,కాన్వాయ్ లు పెరుగుతాయి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు వల్ల రాష్ట్రంలో ప్రజల కు కలిగే లాభం ఏమీ లేదన్నారు. రివర్స్ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు గా ఎవరుంటే ఏమిటని ప్రశ్నించారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే వేదిక పై గవర్నర్ ఉంటారని మర్చిపోయి వైస్సార్సీపీ ప్లీనరీ వేదిక మాదిరిగా వేదికని సిద్ధం చేశారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంలా కాకుండా రాష్ట్ర వైస్సార్సీపీ కార్యక్రమంలా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ సిద్ధం కావడం సరికాదన్నారు.

రెండున్నర సంవత్సరాల కాలం కూల్చివేతే పరమావధిగా గడిపిన ముఖ్యమంత్రి ఇకనైనా మంచి ప్రజా ప్రయోజన పాలనపై దృష్టి సారించాలన్నారు. మంత్రులు చేతుల్లో పాలన లేకుండా తానే సజ్జల రామకృష్ణ రెడ్డి చేతుల మీద పాలన చేసే విధానాన్ని విడనాడాలని అన్నారు. ఇకనైనా మంత్రులు కు పాలనలో స్వేచ్ఛ కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచించాలి అన్నారు.

మంత్రి వర్గం మార్పు సందర్భంగా రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ నేతలు న్యూసెన్స్ సృష్టించిన విషయం జగన్మోహన్ రెడ్డి గమనించి తన స్వంత పార్టీని నడుపుకునే విషయం లో విఫలమైన విషయం గుర్తించాలన్నారు .అన్నీ వ్యవస్థ లను కూల్చినట్లు గా మంత్రివర్గాన్ని కూలబట్టే పాత మంత్రులు, ఆశావహులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారన్నారు. తనపై వచ్చిన వ్యతిరేకత అర్థం కాకపోతే స్వంత పార్టీ నేతలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఖాయమని రావుసుబ్రహ్మణ్యం అన్నారు.

Related posts

విలాసాలకు మరిగిన యువకులు చోరీలు చేస్తూ…

Satyam NEWS

ఐ‌టి రంగం ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

Murali Krishna

పారిశుధ్య కార్మికునిపై సానిటర్ ఇన్ స్పెక్టర్ దాడి

Satyam NEWS

Leave a Comment