28.7 C
Hyderabad
April 20, 2024 08: 36 AM
Slider ప్రత్యేకం

పెన్షన్ ఇచ్చేందుకు ‘వితంతువు’ అనే పేరు మార్చాలి

#sunitalaxmareddy

భర్త కోల్పోయిన స్త్రీలను వితంతువు అని పేరు పెట్టి ఆసరా పెన్షన్ ఇవ్వడం హేతుబద్ధంగా లేదని విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక అధ్యక్షురాలు లీలావతి చీకూరి అన్నారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి కి నేడు ఆమె వినతిపత్రం అందచేశారు. వితంతు,ఒంటరి మహిళ పెన్షన్ గా పిలవడం వలన అవి అందుకుంటున్న మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని, ఈ పేర్లను త్వరితగతిన తొలగించి మహిళలకు ధైర్యం కల్పించే  పేర్లు పెట్టాలని ఆమె కోరారు. సునీతా లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఈ పేర్లను సవరించే అంశం ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకు వెళతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, అనంత పద్మ,ప్రత్యూష,శకుంతల, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Murali Krishna

సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment