29.2 C
Hyderabad
September 10, 2024 15: 16 PM
Slider క్రీడలు

విజయసాయి క్లీన్‌ బౌల్డ్‌.. కేశినేని చిన్ని సిక్సర్‌..!!

#VijayasaiReddy

వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌లో పెత్తనం చెలాయించిన పెద్దోళ్లు ఇక తప్పుకున్నారు. వైసీపీ పెద్దలు క్రికెట్ అసోసియేషన్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాక, క్రికెట్ హనుమ విహారిని  కూడా అవమానించిన చరిత్ర వారికి ఉంది. వైసీపీ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోనే క్రికెట్ అసోసియేషన్ పని చేసేది. అయితే, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ టీమ్‌ బయటకు వెళ్లిపోయింది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను విజయసాయి తన చుట్టాల చేతుల్లో పెట్టిన సంగతి తెలిసిందే. సాయి అల్లుడి అన్న, అరబిందో గ్రూపునకు చెందిన పి.శరత్‌చంద్రా రెడ్డి రెండుసార్లు ఏసీఏ ప్రెసిడెంట్ గా పని చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా విజయసాయి అల్లుడు పి.రోహిత్‌ రెడ్డి ఉండేవారు. సెక్రటరీగా ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా రాకేశ్‌, కోశాధికారిగా ఏవీ చలం పనిచేసేవారు. వీరంతా విజయసాయి అనుచరులే. అయితే, ఇప్పుడు ఏపీలో రాజకీయం మారడంతో ఏసీఏలోని విజయసాయి రెడ్డి వర్గం మొత్తం రాజీనామాలు చేసింది.

కొత్త కార్యవర్గం ఎన్నిక కానుంది. సెప్టెంబరు 8న గుంటూరులో ఏసీఏ కొత్త కార్యవర్గం ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏకి కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏసీఏలో ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల క్రికెట్‌ సంఘాలు, రాష్ట్రవ్యాప్తంగా 18 క్రికెట్‌ క్లబ్బులు, ముగ్గురు ఇంటర్నేషనల్ క్రీడాకారులతో కలుపుకొని మొత్తం 34 మంది సభ్యులుగా ఉంటారు. వీరంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వం వైపు ఆసక్తిగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే క్రికెట్ అసోసియేషన్ ను విముక్తి చేసే బాధ్యతను కేశినేని చిన్ని తీసుకున్నారు.

అయితే, 2019లో వైసీపీ అరంగేట్రంతోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను విజయసాయిరెడ్డి అనుచరులు, బంధుగణం కబ్జా చేసేశారు. నిజానికి క్రికెట్ అసోసియేషన్ అనేది ఇండిపెండెంట్ గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. బీసీసీఐ నియంత్రణలో ఏసీఏ పని చేయాలి. ప్రభుత్వం నుంచి అసలు నిధులు ఏమీ రావు. కానీ వైసీపీ ప్రభుత్వం దీనికి రాజకీయ రంగు పులిమింది.

ఏసీఏలో గత ఐదేళ్లలో అనేక వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే.  పాలకవర్గం రాజీనామాలు చేయడానికి ముందు తమ బంధువులైన కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, తమ కోసమే పనిచేసిన వారికి భారీగా జీతాల పెంపు, కొత్త ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కార్యదర్శి గోపీనాథ్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

పైగా క్రికెటర్ హనుమ విహారి ఉదంతం పెద్ద రచ్చనే అయింది. ఆయన్ను దారుణంగా అవమానించడం అప్పట్లో రాష్ట్రంలో సంచలనం అయింది. ఏసీఏ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హనుమ విహారి ట్వీట్లు కూడా చేశారు. రంజీ ట్రోఫీ అనంతరం తనను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని, కనీసం ప్లేయింగ్ ఎలెవెన్‌లో కూడా చోటు దక్కించుకోలేని ఓ అనామక ప్లేయర్ కోసం తనను సైడ్ చేశారంటూ ఆరోపించాడు హనుమ విహారి.

ఓ రాజకీయ నాయకుడి కొడుకు కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించిందని ఆరోపణణలు చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ పరిణామాలతో ఇకపై ఆంధ్రా క్రికెట్ టీమ్‌కి ఆడనంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు హనుమ విహారి. మళ్లీ కూటమి ప్రభుత్వం  వచ్చాక మళ్లీ అదే టీమ్ కు ఆడేందుకు రెడీ అయ్యాడు.

Related posts

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలి

Satyam NEWS

అన్నవరం దేవస్థానంపై ముగిసిన విజిలెన్స్ విచారణ

Satyam NEWS

సేఫ్:పాఠశాల వ్యాన్ బోల్తా విద్యార్థులకు గాయాలు

Satyam NEWS

Leave a Comment