25.2 C
Hyderabad
January 21, 2025 10: 47 AM
Slider ప్రత్యేకం

చౌక టీ పొడి ఆరోగ్యానికి హానికరం

#teacup

ఏలూరు లో కల్తీ టీ, కాపీ, పొడుల వ్యాపారాలు జోరుగా సాగుతున్నది. రకరకాల రాష్ట్రాల పేరులతో కొన్ని కల్తీ టీ పొడి కంపెనీ లు కళ్ళు జిగేలుమనే ఆకర్షణీయ మైన ప్యాకింగ్ లు చేసి కొంత మంది వ్యాపారులు మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు,ఈ కల్తీ టీ పొడి మార్కెట్ లో తక్కువ రేటుకు అందుబాటులో ఉండటం తో చాలా మంది టీ బడ్డి వ్యాపారులు ఈ టి పొడి నే వాడుతున్నట్టు తెలిసింది.

ఈ టీ పొడిని వ్యాపారులు పావు కేజీ, అరకేజి, కేజీ ల ప్యాకింగ్ ల ద్వారాను, కస్టమర్ లా కోరిక మేరకు వారికి కావాల్సినంత  లూజు టీ పొడి కూడా సరసమైన రేట్లకు విక్రయిస్తున్నారు. పట్టణ, పల్లెలలో కూడా చాలా మంది టీ హోటల్స్ ఈ కల్తీ టీ పొడినే విరివిగా వాడుతున్నారని సమాచారం. ఇటువంటి కల్తీ టీ పొడి తో టీ బ డ్డి లో ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న హోటళ్ల లో తయారు చే సీ విక్రయించే టీ ల ద్వారా ప్రజల ఆరోగ్యం హరించే ప్రమాదముందని చాలా మంది భావిస్తున్నారు. మార్కెట్ లో విక్రయించే  టీ పొడి లో చింత పండు గింజల పొడి ఎక్కువ శాతం కలుస్తుందని అనుకుంటున్నారు.

బ్రాండెడ్ కలిగిన ట్రీ రోజేస్, టాటా,తాజ్ మహల్,చక్రా గోల్డ్, బాగ్ బాక్రీ టీ,  లిఫ్టన్ బ్రూక్ బాండ్ టీ పొడి లు సామాన్యులకు అందుబాటు లో ఉన్నా చాలా మండి అమాయక ప్రజలు, ట్రక్ డ్రైవర్ లు,అత్యవసర సమయాలలో బై పాస్ రహదారి లో ప్రయాణించే ప్రయాణికులు చాలా మంది ఇటు వంటి కల్తీ టీ పొడి ఉపయోగించే  టీ బడ్డీ లలో టీ లు తాగుతుంటారు. అది ఎటువంటి టీ పొడి అనేది చూడరు. సమయానికి అందు బాటు లో ఉన్న బడ్డీ దగ్గర లభించే టీ నీ రెండు చుక్కలు తాగి వెళ్లిపోతుంటారు.

ఇటు వంటి కల్తీ టీ పొడి తో తయారు చేసే టీ లు తాగి చాలా మంది ప్రజలు బ్రెయిన్ కి సంబంధించిన, జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదముందని ప్రజలు భయపడు తున్నారు. చవకగా దొరికే టీ పొడులు వాడి ఆరోగ్యాలను  పాడు చేసు కో వద్దంటూ న్యూట్రీషియన్ లు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Related posts

రైతాంగ పోరాట చరిత్రలో నిలిచిన గుండ్రాపల్లి

Satyam NEWS

ఆ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ…!

Satyam NEWS

సౌమ్యనాధ బ్రహ్మోత్సవం: హంస వాహనం పై వీణా పాణి

Satyam NEWS

Leave a Comment