35.2 C
Hyderabad
April 20, 2024 16: 12 PM
Slider హైదరాబాద్

రసాయనిక ఎరువులు తగ్గించాలి సేంద్రీయ ఎరువులు పెంచాలి

#Chemicalfertilizers

ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలో భూసార పరీక్షల కార్డుల పంపిణీ కార్యక్రమం జయశంకర్ రాజేంద్రనగర్ యూనివర్సిటీ భూసార పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త మాధవి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఉపాధ్యక్షులు వి.యస్. ప్రసాద్ శాస్త్రి, మండల వ్యవసాయ అధికారి కవిత , గ్రామ ప్రముఖులు యాదగిరి రెడ్డి సొసైటీ చైర్మన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

భూసార పరీక్షల ద్వారా భూమిని సారవంతం చేసుకోవడానికి ఏ మోతాదులో రసాయనిక ఎరువులు వాడాలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని విధిగా కొనసాగించాలో రైతులకు అవగాహన ఏర్పరచటం ప్రపంచ దినోత్సవ సందర్భంగా ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ( ఐక్యరాజ్యసమితి విభాగంFAO) లక్ష్యం గా పనిచేయాలని పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త మాధవి మాట్లాడుతూ ప్రైవేటుగా భూసార పరీక్ష చేయించుకోవాలి అంటే 4000 రూపాయలు ఖర్చు అవుతుందని విశ్వవిద్యాలయ భూసార పరీక్షల విభాగం లో కే వలం నాలుగు రూపాయలకే భూసార పరీక్షలు చేసి కార్డులు పంపిణీ చేస్తామని రైతులు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు .తెలంగాణ రాష్ట్రంలో భూమిలో కర్భనం 5% మాత్రమే ఉందని భూసార పరీక్షలు చేసుకోకుండా ఎక్కువ ఖర్చుతో రసాయనిక ఎరువులను ఎంత గుప్పించినా పంటల దిగుబడి పెరగదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు వి.ఎస్ .ప్రసాద్ శాస్త్రి గారు మాట్లాడుతూ భూమి ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ప్రతి రైతు భూసార పరీక్ష చేయించాలన్నారు.

ప్రధానమంత్రి మోడీ 2016 వ సంవత్సరంలో 12 కోట్ల మందికి భూసార పరీక్షల కార్డులు పంపిణీ చేశామని 2018 వ సంవత్సరంలో 11 కోట్ల మందికి భూసార పరీక్షల కార్డులు పంపిణీ చేశామని చెప్పారు .దీని ప్రకారం ప్రతి రైతుకు రెండు కార్డులు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి కానీ ఏ రైతు చేతిలో కార్డు లేదు అన్న నగ్నసత్యం కొట్టొచ్చినట్లుగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ భూ సారాన్ని పెంచగలిగితేనే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని, భూగర్భ జలాలను కాపాడుకోగలుగుతామని తద్వారా అకాల వారి వర్షాలను వరదలను అరికట్టగలుగుతామని, ముఖ్యంగా రైతుల వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు కూడా తగ్గుతుందని , పంటల దిగుబడిని పెంచుకోగలుగుతామన్నారు.

సేంద్రీయ ఎరువులను తయారు చేసుకోవడానికి ప్రతి చిన్న సన్న కారు రైతు కుటుంబాలకు పశువులను- ఆవులను గాని గేదెలను గాని ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయాలి. అందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి

Satyam NEWS

భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

Satyam NEWS

Mostbet Haberler Haberleri Son Dakika Gelişmeleri

Bhavani

Leave a Comment