పోలీస్ భద్రత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతూ, ఆర్థిక భరోసా కల్పిస్తుందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సివిల్ కానిస్టేబుల్ ఉమ్మాల బాలరాజు ,పీసీ -3195 కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన 15,95,800/- చెక్కును, బాలరాజు భార్య మంజుల, పిల్లలకు, వారి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ భద్రత చెక్కులను అందజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా భద్రత స్కీమ్ ద్వారా చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమములో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, బిసిఆర్బి ఎస్సై, సెక్షన్ సూపర్డెంట్, రాజవర్ధన్ ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్