39.2 C
Hyderabad
April 25, 2024 15: 52 PM
Slider హైదరాబాద్

సర్వ మతాలకు ప్రాధాన్యతనిచ్చిన సీఎం

kavitha

రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిచ్చిన ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు. ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చెరీష్ ఫౌండేషన్ లో ఉన్న45 మంది బాలబాలికల చదువులకు సహకారం అందిస్తానని ప్రకటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత 16 ఏళ్లుగా చెరీష్ ఫౌండేషన్ ను నిర్వహిస్తూ అనాధ పిల్లలకు ఆశ్రయమిస్తున్న డేవిడ్ సుబ్రమణ్యంకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు. ఆశ్రమంలో ఉన్న45 మంది బాల బాలికలు తన కుటుంబ సభ్యులతో సమానం అన్న ఎమ్మెల్సీ కవిత, ఆశ్రమానికి సొంత స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగాలు సాధించేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆశ్రమంలోని బాలబాలికలు ప్రార్థనలు, భక్తి గీతాలు ఆలపించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, ఫిర్జాదీగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.

Related posts

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Sub Editor

తెలంగాణ రన్’ కార్యక్రమంలో సీబీఐటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు

Bhavani

రాజంపేట 23% ఫిట్ మెంట్ జీవో కాపీల దహనం

Satyam NEWS

Leave a Comment