33.2 C
Hyderabad
June 20, 2024 20: 16 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చెత్తపలుకు: డబుల్ ఎల్లో జర్నలిజం

ys cbn

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను లంచ్ కి పిలిచారట. పిలిచి ఆయనతో చెప్పారట ‘ఫలానా సామాజిక వర్గం వారు నా టార్గెట్. వాళ్లను ఫినిష్ చేస్తా. అప్పటి వరకూ ఎవరి మాటా వినను. గత ప్రభుత్వం నీకు భూమి ఇచ్చిందట కదా దాన్ని కూడా రద్దు చేస్తా’ అని అన్నారట. ఈ మాటలు విని ఢిల్లీ వెళ్లిన ఆ పారిశ్రామికవేత్త ‘ఆంధ్రా సిఎం మ్యాడ్ ఫెలో’ అన్నాడట. – ఓ రాధాకృష్ణా ఇలాంటి అభూత కల్పనలు రాయడం పత్రికాస్వేచ్చా? ఏ ముఖ్యమంత్రి అయినా తనకు గిట్టనివాణ్ణి లంచ్ కి పిలిచి మాట్లాడతాడా? లంచ్ కి వచ్చినవాడితో ఇలాంటి విషయాలు చెబుతాడా?

ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు? ఇలాంటి అభూతకల్పనలు ప్రచారం చేస్తుండటం వల్లనే ఈ చెత్తపలుకు రాయాల్సి వస్తున్నది. తను రాస్తున్న చెత్తపలుకులకు జాతీయ మీడియాను ఈ వారం తోడు తెచ్చుకున్నాడు. గత వారం రోజుల నుంచి చంద్రబాబునాయుడు జాతీయ మీడియాకు ఎలాంటి సమాచారం ఇచ్చి రాయిస్తున్నాడో సత్యంన్యూస్ సోదాహరణంగా పలు పోస్టుల్లో చెబుతూనే వచ్చింది. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని జాతీయ మీడియాలో ఎలా ప్రచారం చేసుకున్నారో కూడా సత్యంన్యూస్ వివరించింది.

అది వదిలేద్దాం. జగన్ కు ఆయన తాత వై ఎస్ రాజారెడ్డి పోలికలు ఉన్నాయట. ఏం కాకమ్మ కబుర్లు చెబుతావు సోదరా? రాజారెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడా? ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన పాలసీల గురించి మాట్లాడాలి. నిన్న సిబి నాయుడు ప్రెస్ కాన్ఫరెన్సులో జగన్ వ్యక్తిత్వం గురించి దారుణంగా చెప్పాడు. నీవు అవేమాటలు నీ చెత్తపలుకులో ఉటంకించావు. నువ్వు ఆయనకు రాసిచ్చావా లేక ఆయన నీకు చెప్పి రాయించాడా? ముందు ఈ విషయం స్పష్టం చేయి సోదరా తెలుసుకోవాలని ఆతృతగా ఉంది.

ముఖ్యమంత్రికి మంచిచెడ్డలు చెప్పేందుకు ఒక్క మంత్రి కూడా లేడట. మా వాడికి తిక్క చెబితే వినడు అని ఒక మంత్రి చెప్పాడట. గత కొన్ని వారాలుగా ఇదే రాస్తున్నావు. ఇంతకీ నీతో మాట్లాడే ఆ మంత్రి ఎవరో చెప్పవా? అసలు నీవు ఆ మంత్రితో ఎందుకు మాట్లాడావో చెప్పవా? ఏ సందర్భంలో మాట్లాడావో చెప్పవా? ప్లీజ్. జాతీయ మీడియా ఏ ఏ సంపాదకీయం రాసిందో ఎంతో వివరంగా చెప్పావు కరెక్టే మరి జగన్ ఆ పత్రికల్ని బ్యాన్ చేశాడా? నిన్నే ఎందుకు ఆక్షేపిస్తున్నారో ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకో.

పైన చెప్పిన రెండు విషయాల కోసమే నీపై ఎల్లోమీడియా అనే ముద్ర వచ్చింది సోదరా. రివర్స్ టెండరింగ్ అభ్యంతరకరంగా ఉంది- ఎందుకు ఉండదూ, నీకు కావాల్సిన వారికి కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కంపెనీకి ఇస్తుంటే. ఉంటుంది. సిబినాయుడు ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టాడో వారినే కొనసాగించాలి, సిబినాయుడు ఎవరిని పదవుల్లో నియమించాడో వారినే కొనసాగించాలి. చివరికి సిబి నాయుడిని కూడా అదే స్థాయిలో కొనసాగించాలి- ఓ సోదరా మరి ప్రభుత్వం మారింది ఎందుకు? జగన్ సిఎం అయింది ఎందుకు? సిబి నాయుడి పాలన బాగాలేదు సరిదిద్దమని కదా జగన్ కు 151 సీట్లు ప్రజలు కట్టబెట్టారు.

వంద రోజులు కూడా కాలేదు అప్పుడే గగ్గోలు- అమరావతి పూర్తి కాలేదు, పోలవరం పూర్తి కాలేదు…. వందరోజుల్లోనే అన్నీ అయిపోతాయా? గ్రాఫిక్స్ కూడా వందరోజుల్లో పూర్తి కాలేదు. ఐదేళ్లు పట్టింది. అమరావతిలో 180 ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు ఇదే చెత్తపలుకు చెబుతున్నది. అంటే అమరావతిలో కుంభకోణం జరిగినట్లు, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు  పాపం, తెలియకుండానే ఒప్పుకున్నాడు. అదే కదా వైసిపి చెబుతున్నది. ఇక జగన్ మీడియా గురించి కూడా చెత్తపలుకు చాలా విషయాలు చెప్పింది. జగన్ మీడియా రాసిన రాతలు కూసిన కూతలు జర్నలిజానికి ఆమడ దూరంలో ఉన్నాయని చెత్తపలుకు వ్యాఖ్య.

నీవు రాసేవి జర్నలిజం ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నాయా? కులం గురించి పదే పదే ప్రస్తావించే నువ్వు జర్నలిజం గురించి మాట్లాడితే ఎలా? సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని సిబి నాయుడు అనుకుని విమర్శలకు భయపడి వెనకడుగు వేశారట. మరో టివిని బ్యాన్ చేద్దామంటే ఈ చెత్తపలుకు అడ్డం పడ్డదట. మరి సాక్షిని బ్యాన్ చేద్దాం అని సిబి నాయుడు నీతో అంటే నీవు సరే అని తలూపావా? అహా ఏం లేదు… సదరు ఛానెల్ ను బ్యాన్ చేస్తానంటే అడ్డుపడ్డానన్నావు కదా అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను.

జగన్మోహన్ రెడ్డి ప్రతీకారేచ్ఛలో కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నాడని మరో కామెంటు. ఈ కామెంటు రాయగానే భయం మళ్లీ కేసీఆర్ తన మీడియాను బ్యాన్ చేస్తాడేమోనని, అందుకే కవరప్ గా కేసీఆర్ నాకు మిత్రుడు అని. ఏం నాటకాలు సోదరా? నీకే చెల్లింది. కేసీఆర్ నీకొక్కడికే మిత్రుడా? ఇలాంటి రాతలు రాయడం జర్నలిజం స్వేచ్ఛ కాదు….కారాదు. అసలు జర్నలిజం స్వేచ్ఛ అంటే పత్రికాధిపతుల స్వేచ్ఛ కారాదు.

పత్రికా స్వేచ్ఛ అంటే పని చేసే జర్నలిస్టుల స్వేచ్ఛ కావాలి. నీ ఛెనెళ్లను తెలంగాణలో బందు పెట్టినపుడు పోరాటం చేశావా? సాగిలపడ్డావా? మరి చాలా మంది నీవు సాగిలపడ్డావు అంటారేంటి?

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

ఇంటింటి ప్రచారంలో భువన్ కుమార్ రెడ్డి బిజీ

Satyam NEWS

తిరుపతి నుంచి ఉడాన్ కింద విమానాలను నడుపుతోందా?

Satyam NEWS

రామతీర్ధం లో రామయ్య పెళ్లికి ఏర్పాట్లు పూర్తి..!

Satyam NEWS

Leave a Comment