28.7 C
Hyderabad
April 25, 2024 06: 43 AM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు: అమరావతి-అసత్యాలు-ఎల్లోమీడియా

Amaravathi

మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్ అని గురజాడ అన్నది ఆంధ్ర ప్రజలు అందరిని ఉద్దేశించి కాదు. ఇలాంటి మీడియా వస్తుందని ఊహించి ఈ ఎల్లో మీడియాను ఉద్దేశించే గురజాడ అన్నారు. గత వారం కాలమ్ లో కూడా ఆంధ్రా ప్రాంత ప్రజల గురించి అత్యంత నీచంగా రాసిన ఈ చెత్తపలుకు రచయిత ఈ సారి ఆంధ్రా ప్రజలను వెధవలని తేల్చాడు. ఈ ఎల్లో రచయితకు ఆంధ్రప్రజలపై ఎందుకు ఇంత కసి? అమరావతి నుంచి రాజధానిని మారుస్తారని ఊహాగానాలు వ్యాప్తి చెందడంతో ఒక్క సారిగా ఆంధ్రా ప్రజలు ఊరూరా ఆందోళనలు చేస్తారని సిబి నాయుడు, ఎల్లో మీడియా అంచనా వేసుకున్నాయి. అయితే అలా జరగలేదు.

ఆస్తులు పోతున్నాయన్న ఆందోళన తెలుగుదేశం నాయకులకు ఉన్నట్లు ఆంధ్రా ప్రజలందరికి ఎందుకు ఉంటుంది? రాజధాని భావోద్వేగమైన విషయమా? పరిపాలనా సంబంధ అంశమా? భావోద్వేగమైన అంశంగా మార్చి దాని మాటున సొంత ఆస్తులు పెంచుకోవడంలో నిమగ్నం కావడం శ్రేయస్కరమా? లేక ప్రజలను దాన్నించి బయట పడేయడం మంచిదా? చాలా మంది మహిళలు తమ నగలు ఇచ్చారు. కరెక్టే- ఆ లెక్కలు పబ్లిక్ కు ఏనాడైనా చెప్పావా సోదరా? రాజధాని మారిస్తే అభివృద్ధి ఆగిపోతుందట.

తెలంగాణ విభజన సమయంలో కూడా ఈ కుహనా మేధావులు ఇలానే చెప్పారు. తెలంగాణ విడిపోతే నీళ్లుండవని, కరెంటు ఉండదని, తెలంగాణ ప్రజలు అడుక్కుతింటారని చెప్పారు. ఆంధ్రా నుంచి వచ్చిన ఒక కులం వారి వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, వారంతా రివర్స్ వెళ్లిపోతే హైదరాబాద్ ఆగిపోతుందని కూడా ఈ కుహనాలు చెప్పారు. ఆగిందా? తెలంగాణ నాశనం అయిందా? ఈ కుహనా మేధావులు కోరుకుంటే జరగదు గాక జరగదు. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఇలాంటి మరో కుహనా మేధావి పబ్లిక్ గా చెప్పేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో వచ్చే బ్రోకరేజితో రాజధాని ని కడతాడట సిబి నాయుడు.

వీరి గురించి కాదా గురజాడ చెప్పింది – మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్ అని. ఈ కుహనా మేధావులు ప్రతి వాడూ చెప్పేది ఒక్క సారి గమనించండి. అమరావతిని చదరపు గజాల్లో, దాని ధరల్లో మాత్రమే చెబుతారు. స్థలాలు వాటి ధరల గురించి మాత్రమే మాట్లాడతారు. అంతా బిజినెస్. వీరికి మానవ సంబంధాలు కూడా బిజినెస్సే. సిబి నాయుడుట ఆంధ్ర ప్రజలకు చక్కని రాజధాని కట్టి ఇచ్చి, రెండు లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఇచ్చేవాడట. చేతిలో చిల్లిగవ్వ లేకుండా సంపద సృష్టించడం గొప్పవిషయం కాదా అని కూడా ఈ కుహనా మేధావి చెబుతున్నాడు.

ఈ సంపద అంతా ఎవరి చేతుల్లోకి వెళుతుందో అర్ధం చేసుకునే సిబి నాయుడిని 23కు తెచ్చారు సోదరా ఈ చిన్న లాజిక్కు నీకు అర్ధం కాలేదు. ఆఖరికి రాజధాని ప్రాంతంలో యువసామ్రాట్టు కూడా ఓడిపోయాడు. రాజధాని ఏర్పాటు సిబి నాయుడు క్రమ పద్ధతిలో చేశాడా? అఖిలపక్షం పిలిచాడా? అందరి అభిప్రాయం తీసుకున్నాడా? శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు చూశాడా? అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు సహేతుక నివేదిక ఇస్తే దాన్ని అయినా పట్టించుకున్నావా? భూ సేకరణ సమస్య లేకుండా ఉండాలంటే దొనకొండలో రాజధాని పెట్టాలని ఎంతో మంది చెబితే విన్నావా? ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ ఒక కులం గురించి రాజధాని కాదు అని చెప్పాడట. దాన్ని పట్టుకుని పీకుతున్నారు.

అందరి మాటలు పెడచెవిన పెట్టి తుళ్లూరులో రాజధాని పెట్టింది బొత్స చెప్పిన మాటలు నిజం అనిపించడం లేదా? రాజధాని ఇక్కడే ఉంటుంది అని సిఎం జగన్ తో చెప్పించాలని, అలా ఆయన చెబితే ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చి దున్నుకోవాలని ఈ తెలుగు బ్యాచ్ ప్లాన్ వేసింది. అయితే పాపం వారు ఆశించినట్లు సి ఎం బయటకు రాలేదు, వారు కోరుకున్న విషయం చెప్పలేదు- మూల విరాట్టు లాగా(చెత్తపలుకు చెప్పినట్లు). సిఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతకూ మాట్లాడకపోవడంతో చివరకు ఈ ఎల్లో మీడియానే రాజధాని ఏ షేప్ లో ఉండబోతున్నదో కూడా చెప్పేస్తున్నది- అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం లాగానే ఉంటుందట. నాలుగు ప్రాంతాలలో మిగిలిన పెద్ద ప్రాజెక్టులు ఉంటాయట. మంచిదే కదా సోదరా? మీలాంటి కుహనా మేధావులు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమన్నారో మర్చిపోయావా సోదరా?

అభివృద్ది అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వల్లే రాష్ట్ర విభజనకు సమస్య వస్తున్నది అని చెప్పావా లేదా? ఆనాడే ఒక్క హైదరాబాద్ లో కాకుండా విశాల ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్లకు పెద్ద ప్రాజెక్టులు తరలించి ఉంటే ఈ సమస్య రాదని చెప్పావా లేదా? మరి నీవు చెప్పినట్టే జగన్ ఆలోచన అదే అయితే ఏడుపెందుకు? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక్క హైదరాబాద్ లో తప్ప ఎక్కడా పెట్టుబడులు రాలేదట. నీ వాదన కోసం ఏ అంశాన్ని అయినా నీకు తోచినట్లు వాడుకుంటావు సోదరా అందుకే నీవు జర్నలిస్టుగా పని చేసిన పత్రికనే కొనేశావు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు పెద్ద పెద్ద ప్రాజక్టులు రావడానికి సంబంధం లేదని కూడా నీవే చెబుతావు. కొంచెం క్లారిటీ ఉండాలి సోదరా? జర్నలిజం ముసుగు తొలగించి సిబినాయుడి సైన్యంలా మాట్లాడితే నీవు ఏం చెప్పినా ఫర్లేదు సోదరా.

ఆంధ్రప్రదేశ్ లో కులతత్వం ఎక్కువ ఉందని స్టేట్ మెంటు జారీ చేశాడు చెత్తపలుకుగాడు. ఈ కులతత్వం వచ్చిందే నీలాంటి వాళ్లవల్ల. ఆంధా వాళ్లు వెధవలు, కులతత్వం గాళ్లు- ఇతని పేపర్ ను ఇంకా ఆంధ్రా వాళ్లు చదువుతుంటే ఇక నైనా ఒక నిర్ణయం తీసుకోండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే డబ్బులు కావాలి కదా అని ఈ చెత్తపలుకుగాడు ప్రశ్నిస్తున్నాడు. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? ప్రభుత్వ భూములు అమ్మి సొమ్ము చేసుకోవడమా గవర్నెన్స్ అంటే. ప్రభుత్వ భూములు భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకునేవి.

అలాంటి వాటిని అమ్మేసుకునే సాంప్రదాయాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ఎవరో అందరికి తెలుసు. ఇదే ప్రయోగం అక్కడ చేయకుండానే ఓడగొట్టారు. సిఎం జగన్ చేస్తున్న పనుల వల్ల మూడె నెల్లలోనే ప్రభుత్వ ఆదాయం పడిపోయిందట. గత వారం కూడా ఇదే రాశాడు. మళ్లీ ఇప్పుడూ అదే రాశాడు. అసత్యాన్ని పదేపదే చెబితే నిజమైపోతుందనే నమ్మకం బాగా ఎక్కువ ఈ చెత్తపలుకుకు. ఓ సిఎం జగనూ, ఈ కుహనా మేధావి చెప్పింది వినయ్యా ఏపిలో ఆదాయం పెరిగేలా చేస్తాడు. ఆంధ్రావాళ్లను వెధవలు, కలుతత్వం గాళ్లు అని రాస్తున్ననువ్వా ఆ రాష్ట్ర హితం కోరేవాడివి?

సిఎం జగన్ ఎవరి మాటా వినడం లేదట. ఆహా ఎంత బాగా చెప్పావు? ఎవరి మాటా వినడు చెప్పింది చేస్తాడు అనే జగన్ ను ఏపి ప్రజలు గెలిపించింది. ఆఖరు నిమిషం వరకూ సెంటిమెంటుతో గెలవాలని చూసిన సిబినాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. లాబీల మాట విని అమరావతిని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశాడో తెలుసు. అందుకే 23.

Related posts

ముదిరాజులను అణచివేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

టీఆర్ఎస్ గెలుపే బస్తీ సమస్యలు తీర్చే మలుపు

Satyam NEWS

శ్రామికుల జ‌య‌భేరి

Satyam NEWS

Leave a Comment