ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేతులు మారి మూడే మూడు నెలలు…. అబ్బా ఎంత కసి, ఎంత ఉక్రోషం, ఎంత అసహనం. ఆంధ్రజ్యోతి రాయడం, మరునాడు అదే విషయాన్ని సిబి నాయుడు చెప్పడం, సిబి నాయుడు చెప్పడం దాన్ని మళ్లీ ఈ పచ్చ మీడియా అంతా వళ్లంతా పూసుకుని ప్రజలకు చూపించడం. ఏమి డ్రామాలు రాధాకృష్ణా? ఎన్ని రోజులు ఈ పాచిపోయిన డ్రామాలే ఆడతారు? కొత్త డ్రామా ఏదైనా ప్రదర్శించండి. కనీసం కొత్తవారైనా చూసి ఆనందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ వారం చెత్తపలుకులో రాధాకృష్ణ అనరాని మాటలు అన్నాడు. టెర్రరిస్టు, మొండివాడు లాంటి పదాలను జగన్ ను ఉద్దేశించి రాయడమంటే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల ఎల్లో మీడియా ఎంతగా అసహనం ప్రదర్శిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత కసి ఎందుకంటే బడాబడా కాంట్రాక్టులు తీసుకుని లక్షలాది రూపాయల బిల్లులు ఎత్తుకుంటూ ఆనందంగా ఉన్న ఒక వర్గం కాంట్రాక్టర్ల నోటికాడి కూడును వై ఎస్ లాగేసుకుంటున్నాడనే కసి. పోలవరం రీటెండర్లు పిలిస్తే తప్పు, పిపిఏలు సమీక్షిస్తామంటే తప్పు… ఒక్కటేమిటి వై ఎస్ చేసేవన్నీ తప్పుల తడకలే. అందుకే మూడు నెలల్లోనే వై ఎస్ జగన్ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాడని కడప జిల్లాకు చెందిన ఒక రెడ్డిగారు వ్యాఖ్యానించారట. మరి కృష్ణా జిల్లా కమ్మవారు ఏమీ అనడం లేదా సోదరా? సిబి నాయుడికి 23 సీట్లు మాత్రమే వచ్చిన ఏడుపు కంటే వై ఎస్ కు 151 సీట్లు వచ్చిన ఏడుపు అత్యంత విషాదంగా ఉంది. వీళ్ల ఏడుపు ను కరెక్టుగా స్ట్రీమ్ లైన్ చేసి కాలవల్లోకి మళ్లిస్తే మూడు నెలల కిందటే తెలంగాణ, ఆంధ్రలోని అన్ని రిజర్వాయర్లూ ఫుల్ అయి ఉండేవి. కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల సిబి నాయుడి నివాసం మునిగిపోతున్నట్లు ప్రచారం చేశారట? ఎవరు? మీడియా అంతా మీ గుప్పిటిలో ఇప్పటికీ మగ్గుతుంటే, సోషల్ మీడియాలో విస్తృతంగా మీరు అభూతకల్పనలు ప్రచారం చేస్తూఉంటే తప్పుడు ప్రచారం చేసింది ఎవరు? నిజానికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీడియా లేదా సోషల్ మీడియా మేనేజిమెంటు మీ అంత చేతకాదు కదా? కృష్ణానది వరదలు అంచనా వేయడానికి డ్రోన్లు వాడితే అదే సిబినాయుడిని చంపేయడానికని వలవల ఏడ్చింది ఎవరు సోదరా? డ్రోన్ పంపి చంపేస్తారా చంద్రబాబూ? వై ఎస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రాణభయంతో విలవిలలాడిపోతున్నట్లు సిబి నాయుడు చేస్తున్న నటన వెనుక ఒక బలమైన కారణం ఉంది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యారక్టర్ ను బద్నామ్ చేయడం దీని వెనుక ఉన్న కుట్ర. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వర్గానికి నాయకుడు అనే మెసేజ్ పంపడానికి ఎల్లో క్యారెక్టర్లు శతవిధాల ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రచ్చ రంబోలా. నాపై ఉన్న కోపం రాష్ట్రం పై చూపిస్తే ఎలా అని సిబి నాయుడు రెండు రోజుల నుంచి చెబుతున్నాడు. అవే మాటలు యధాతధంగా ఈ పసుపు పచ్చ చిలక చెత్త పలుకులో చెప్పేసింది. ఇల్లు మునిగిపోతే ఇంటి యజమానికే కదా నష్టం ఈయనకేంటిట అని ఈ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తున్నాడంటే ఈయన గారి జర్నలిజం అవగాహన ఎంతో అర్ధం చేసుకోవచ్చు. వరదలు వచ్చినపుడల్లా లోతట్టు ప్రాంతాల వారిని తరలించడం ప్రభుత్వ విధి. అక్కడి వారు రామని గొడవ చేస్తారు. అయినా సరే ప్రభుత్వం పోలీసులను పెట్టి అయినా సరే వారిని తరలిస్తుంది. ఇది ఒక్క వై ఎస్ జగన్ కాదు అన్ని ప్రభుత్వాలూ ఇలానే చేస్తాయి. ఇది తెలీదా సోదరా? ఒక ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వని విషయాన్ని హైలైట్ చేస్తూ రాశాడు చెత్తపలుకులో. సిబినాయుడి హయాంలో ఎల్ వి సుబ్రహ్మణ్యం అనే ఒక సీనియర్ అధికారి ఉండే వారు సోదరా. ఆయన కథ చెబుతా విను. ఆయన సిబి నాయుడి హయాంలో మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా ఉండేవారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ మెడికల్ కాలేజీ అనుమతుల ఫైల్ ఆయన దగ్గరకు వచ్చింది. నిబంధనల ప్రకారం లేదని ఆయన తిరస్కరించారు. దానిపై రాజకీయంగా ఎంతో వత్తిడి తెచ్చినా నిబంధనలు అతిక్రమించి తాను సంతకం పెట్టలేనని ఎల్ వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. దానిపై నీ వియ్యంకుడు స్వయంగా వచ్చి వత్తిడి తెచ్చినా ఆయన ససేమిరా అన్నారు. దాంతో కక్షగట్టిన సిబి నాయుడు ఎంతో సీనియర్ అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను యూత్ సర్వీసెస్ కు బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ కావాల్సిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను మూలకు విసిరేశారు. ఆ తర్వాత ఆయన కు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీ పోస్టు ఇచ్చేసింది. ఆయన చీఫ్ సెక్రటరీ అయిన తొలి రోజు నుంచే ఈ ఎల్లో మీడియా ఆయనపై ఎన్నో రాజకీయ విమర్శలు చేసింది. ఆయనను నీచాతినీచంగా చిత్రీకరించేందుకు తన శక్తియుక్తులన్నింటిని వాడింది. అప్పుడు వచ్చిన నునామీలో సిబినాయుడు కొట్టుకుపోకుండా కనుక ఉంటే మళ్లీ ఎల్ వి సుబ్రహ్మణ్యాన్ని మరింత తక్కువ పోస్టులో నియమించేవారే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందటే పోస్టింగ్ ఇవ్వకపోవడం వల్ల ఐఏఎస్ అధికారులకు జీతం రాక ఆకలితో అలమటిస్తున్నారనే తప్పుడు విషయాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించాలని చేస్తున్న డ్రామాను ప్రజల ముందు ఉంచడానికే. వై ఎస్ జగన్ చర్యల వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతున్నదట. మరీ మూడు నెలలకేనా రాధాకృష్ణా కొద్ది రోజులన్నా ఆగలేవా సోదరా? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ ను కూడా బద్నామ్ చేసే ప్రయత్నం చేశాడు మా సోదరుడు. అప్పులు తెచ్చి తెలంగాణ లో ఆయన ప్రాజెక్టులు కట్టేస్తున్నాడట. ఆహా ఏం కొత్త విషయం. సిబి నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సొంత డబ్బులతో ప్రాజెక్టుల కట్టి జాతికి అంకితం ఇచ్చేవాడు. తెలుసా? ఎందుకయ్యా ఈ మాటలు??? కే సీ ఆర్ రాత్రికి బార్ పగలు దర్బార్ నిర్వహిస్తాడట. తెలంగాణ నుంచి సిబి నాయుడిని తరిమేసిన కేసీ ఆర్ పై ఈ మాత్రం కసి లేకపోతే అది ఎల్లో మీడియా ఎలా అవుతుంది? ఏపి లో జరుగుతున్న పరిణామాలపై కేసీ ఆర్ మురిసిపోతున్నారట-చెత్త పలుకు ఆయన మనసులోకి దూరి మరీ చెప్పేసింది. ఆంధ్రాలో ఏం జరుగుతున్నది? కేసీ ఆర్ మురిసిపోవడానికి అంటే – అక్కడ సిబి నాయుడు వాష్ అవుట్ అయ్యాడు కదా. బహుశ అందుకు మురిసిపోతున్నరేమో. తెలంగాణ నుంచి తరిమి కొట్టి ఆంధ్రాలో కూడా సిబి నాయుడికి 23 సీట్లు వచ్చేలా చేసిన ఆంధ్ర ప్రజలను చూసి మురిసిపోయిన కేసీఆర్ ఎక్కువ నీళ్లు ఇచ్చి అయినా సరే రాయలసీమను ఆదుకోవాలనుకుంటున్నారేమో. ఇక మాట మార్చే విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీ ఆర్ ను ఈ ఎల్లో మీడియా ద్రోహిగా చిత్రీకరిస్తున్నది. ఐదేళ్ల ఒకే టరమ్ లో పది యూటర్న్ లు తీసుకున్న సిబి నాయుడికి వంతపాడే ఈ ఎల్లో మీడియా ఇతరుల గురించి మాట్లాడే హక్కును ఏనాడో కోల్పోయింది. కొందరి నోటి నుంచి వచ్చే సుభాషితాలు విన సొంపుగా వుండవు.
previous post
next post