24.7 C
Hyderabad
March 29, 2024 07: 41 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ పదవి స్వీకారం

#PocharamSrinivasareddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా చీఫ్ ఇంజినీర్ టి. శ్రీనివాస్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.

 కామారెడ్డి జిల్లా నూతన చీఫ్ ఇంజినీర్ గా, బాన్సువాడ ఇంచార్జ్ ఎస్ ఇగా నియమితులై ఆయన నేడు ఛార్జి తీసుకున్నారు. టి. శ్రీనివాస్ ను ఈ సందర్భంగా శాలువతో సత్కరించిన భాస్కర్ రెడ్డి స్వాగతం పలకారు.

డివిజన్ లో వారికి అన్ని విధాలుగా  రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనలతో, సహాయ సహకారాలతో బాన్సువాడ డివిజన్ నీటి పారుదల రంగాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాలని అన్నారు.

రైతాంగానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు నాయకుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఎంపీపీ వెంకట్ రాం రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రామ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలక్రిష్ణ, ఈ.ఈ. బన్సీలాల్,

డి.ఈ.ఈ. రవి కుమార్, దత్తత్రి, మండల పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ ఏజాజ్, ఉమ, బాడీ శ్రీనివాస్, ఏ.ఈ. శ్రీనివాస్, సింధు, గజానంద్, బాసిద్, రాజ్ కమల్, శివ ప్రసాద్ పాల్గొన్నారు.

Related posts

ముషీరాబాద్ లో 90 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు

Bhavani

చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు..

Sub Editor

స్వాతంత్య్రం కోల్పోయిన అఫ్ఘానిస్థాన్ ప్రజలు

Satyam NEWS

Leave a Comment