31.2 C
Hyderabad
February 14, 2025 20: 27 PM
Slider ముఖ్యంశాలు

భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

#chandrababunaidu

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు  మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సిఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో సిఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టిటిడి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సిఎం తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిఎం ఆదేశించారు.

Related posts

సర్పంచుల సమస్యలపై ఆందోళనతో మండల సభ వాయిదా

Satyam NEWS

పరిసరాలకు ఇబ్బంది లేకుండా భవనం కూల్చివేత

mamatha

నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త

mamatha

Leave a Comment