27.7 C
Hyderabad
April 25, 2024 07: 38 AM
Slider తెలంగాణ

చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం

dasoju shravan

తెలంగాణ క్యాడర్ అధికారులను  కాదని ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్ కు ఎలా సిఎస్ పదవి కట్టబెడతారని  ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 15 మంది సీనియర్స్ ను కాదని సోమేష్ కుమార్ కు సిఎస్ పదవి కట్టబెట్టడం అన్యాయమని ఆయన అన్నారు.

చీఫ్ సెక్రటరీ నియామక నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ కుమార్ నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు. సోమేష్ కుమార్ నియామకం ఓ క్విడ్ ప్రోకో గా ఆయన అభివర్ణించారు. టిఆర్ఎస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చారు కాబట్టే సీఎస్ పదవి సోమేష్ కుమార్ కు ఇచ్చారని ఆయన ఆరోపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో సోమేశ్  కుమార్ టిఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశారని దాసోజు శ్రవణ్ అన్నారు.

అందుకే సిఎం కేసీఆర్ ఆయనకి సిఎస్ పదవి కట్టబెట్టారని అన్నారు. సీఎం కార్యాలయం రిటైర్డ్ ఉద్యోగుల అడ్డాగా మారిందని, డజనుకు పైగా రిటైర్డ్ ఐఏఎస్ లు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ లకు  ప్రాధాన్యత కలిగిన పోస్టింగులు ఇవ్వడం లేదని దాసోజు అన్నారు.

Related posts

నోటిఫికేషన్ లోగా నిర్మాణం పూర్తి కావాలి

Bhavani

రేపటి నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనం ప్రారంభం…

Satyam NEWS

భారత క్రికెట్ కు మళ్లీ దొరికిన వాల్

Satyam NEWS

Leave a Comment