జనతా కర్ఫ్యూకు విశేష స్పందన రావడం, రాయచోటి నియోజక వర్గం ఆదర్శంగా నిలవడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తాడేపల్లి లోని ఆయన నివాసంలో ఆదివారం కుటుంబ సమేతంగా కరోనా వ్యాధి నివారణ కు కృషి చేస్తున్న పోలీసు, వైద్య ,ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్ , పంచాయితీ రాజ్, సచివాలయ అధికారులు , సిబ్బంది చేస్తున్న కృషికి సలాం అంటూ ఆయన అభినందిస్తూ చప్పట్లు కొట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ, సి ఎం జగన్ లు ఇచ్చిన పిలుపు మేరకు నియోజక వర్గంలో జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇదే స్ఫూర్తితో మహమ్మారి కరోనా వైరస్ సంక్రమణ ను ఎదుర్కొని మన ప్రాంతానికి రాకుండా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రోజు వారి కూలీలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడకుండా వారికి మంచి జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలు ,సూచనలు ను పాటిస్తూ కుల,మత ,ప్రాంత బేధాలు లేకుండా అందరం ఐకమత్యంగా నిలుద్దామని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.