39.2 C
Hyderabad
March 28, 2024 16: 50 PM
Slider గుంటూరు

పిచ్చి ముదిరింది: స్వాతంత్య్ర యోధుల పేరు కూడా హాంఫట్

#kallurichandramouli

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్ల పిచ్చి ఎంత ముందిరిందీ అంటే స్వాతంత్య్ర సమర యోధులను కూడా దారుణంగా అవమానిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ కు స్వాతంత్య్ర సమర యోధుడు కల్లూరి చంద్రమౌళి పేరు ఉండేది. ఆ పేరును మార్చి రాష్ట్రంలోని అధికార పార్టీ తన పేరు పెట్టుకున్నది.

ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడంపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ పేరు మార్చవద్దని ప్రతిపక్ష పార్టీలు, కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేసినప్పటికీ మునిసిపల్ ఛైర్మన్ స్థానిక ఎమ్మెల్యే విడదల రజనీ ఆదేశాలను పాటిస్తూ మార్కెట్ కు మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరి చంద్రమౌళి పేరు తొలగించడం అన్యాయం అని కూరగాయలమార్కెట్ పేరు మార్పు రాజకీయాలు ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

పురపాలక సంఘం చిలకలూరిపేటలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయడం శ్రేయస్కరం కాదని చిలకలూరిపేట పురపాలక సంఘం కనీసం కల్లూరి చంద్రమౌళి ఫోటో కూడా పెట్టకుండా అధికార దర్పం ప్రదర్శన చేసినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రజని ఫోటోలు తో పెద్ద లైటింగ్ బోర్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

తక్షణమే లైటింగ్ బోర్డ్ తొలగించి కల్లూరి చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరుతో బోర్డును ఏర్పాటు చేయాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తున్నదని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు కు గౌరవాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగడం సరికాదని, తప్పును సరిదిద్దుకొంటామని ప్రకటన చేయాలని, తప్పును సరిదిద్దుకోవాలని లేకుంటే మార్కెట్ వ్యాపారులు తో కలసి చర్చించి ఉద్యమం చేస్తే ప్రభుత్వం పరువు పోతుందని గుర్తించాలని అన్నారు.

ఇదే అంశాన్ని డైరెక్టరేట్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏకపక్షంగా సాగిన పేరు మార్పు వ్యవహారం వివరిస్తామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మార్కెట్ వర్తకుల ఇంటికి రాజశేఖర్ రెడ్డి నిలయంగా పేరు పెడతారేమో అని ఆలోచించుకోవాలి అని రావు సుబ్రహ్మణ్యం వర్తకులను హెచ్చరించారు.

తమహక్కు గా దశాబ్దాలుగా కొనసాగుతున్న మార్కెట్ పేరు మారుస్తుంటే ప్రతిఘటన మానేస్తే రేపు మార్కెట్ పడేసి షాపులు కూడా వైస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒప్పగిస్తారని గుర్తించాలని అన్నారు.

Related posts

ప్రాణాల‌కు తెగించి ప‌ని చేస్తున్న మీడియా మిత్రులు

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డిసిపి

Satyam NEWS

ఢిల్లీ న్యాయవాదికి బెదిరింపు వచ్చింది రాజంపేట నుంచే

Satyam NEWS

Leave a Comment