30.7 C
Hyderabad
April 23, 2024 23: 39 PM
Slider వరంగల్

బాలల సంరక్షణ కోసం రాష్ట్ర స్థాయి సహాయ కేంద్రం

#mulugu Collector

కరోనా రెండవ దశ నేపథ్యంలో  బాలల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్  దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయక కేంద్రం  టోల్ ఫ్రీ నెంబర్ ను హైదరాబాదు కార్యాలయంలో ఏర్పాటుచేశారని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య  గురువారం తెలిపారు.

ఈ సహాయక కేంద్రం ద్వారా కరోనాకు గురైన బాలలకు, కోవిడ్  సంరక్షణ  కేంద్రం లో తల్లి దండ్రులు ఉండి, పిల్లల పోషణకు ఎవ్వరు లేని ఒంటరి  బాలలకు  లేదా పోషకులు కరోనా బారినపడి ఒంటరిగా ఉన్న బాలలకు, అదేవిధంగా నిస్సహాయ స్థితిలో  ఉన్న  బాలల సహాయం కోసం ఇది పని చేస్తుందని తెలిపారు.

ఈ సహాయక కేంద్రం అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040-2 3 7 3 3665    నెంబర్ తో పని చేస్తుందని, అదేవిధంగా మహిళా 181, 1098  చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ  నెంబర్లను కూడా సంప్రదించి తద్వారా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత,  బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ కే స్వాతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి  జే ఓంకార్  చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ బి ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కరోనా: నోరు మూసుకుని పని చేయాల్సిందే

Satyam NEWS

వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు

Satyam NEWS

టి ఆర్ ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న బిజెపి

Satyam NEWS

Leave a Comment