40.2 C
Hyderabad
April 19, 2024 17: 28 PM
Slider ప్రత్యేకం

ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో 200 మంది పిల్లలు మృతి

modi kids

దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్ర మైన గుజరాత్ లో పసిపిల్లల మారణహోమం నడుస్తున్నది. రాజ్ కోట్, అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో గత నెల రోజుల్లో దాదాపు 200 మంది అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోయారు. ఒక్క రాజ్ కోట్ ప్రభుత్వ ఆసుపత్రి లోనే గత నెల రోజుల్లో 135 మంది పసి పిల్లలు చనిపోయారు.

నెల రోజులుగా గా ఈ పసి పిల్లల మారణ హోం జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు.  అంతే కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ని దీనిపై ప్రశ్నిస్తే స్పందించడానికి కూడా ఆయన నిరాకరించారు. పసిపిల్లల మరణాలకు ప్రధానంగా పౌష్టికాహార లోపం కనిపిస్తున్నది.

తల్లులకు సరైన ఆహారం లేకపోవడం, గర్భవతిగా ఉన్నప్పుడు సోకిన అంటు వ్యాధులు పిల్లల మరణాలకు కారణం అవుతున్నది. అపరిశుభ్ర వాతావరణంలో గర్భవతులు ఉండటం వల్ల వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. చాలా మందికి నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నారు. రాజ్ కోట్ అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుప్రతులలో పిల్లల ప్రాణాలను రక్షించేందుకు ఎలాంటి పరికరాలు లేవు.

ఇన్ క్యుబేటర్ల లాంటి పరికరాలు అసలే లేవు. కనీసం ఆక్సిజన్ పెట్టేందుకు కూడా అక్కడ వీలు లేకుండా ఉందని అంటున్నారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన 28 నెబ్యులైజర్లలో 22 నిరుపయోగంగా ఉన్నాయి. వైద్యులు, నర్సుల కొరత కూడా ఆసుపత్రి పనితీరును ప్రభావితం చేసింది.  కేంద్ర ప్రభుత్వం పంపిన ఎయిమ్స్ నిపుణుల బృందానికి కూడా ఈ విషయం తెలిసింది. 

ఆస్పత్రిలో తగినంత ప్రాణాలను రక్షించే పరికరాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కనుగొంది. అవసరమైన సమయంలో ఆక్సిజన్ సరఫరా లేదు.  రూ .6 కోట్ల ఆసుపత్రి నిధి ఉన్నప్పటికీ, పరికరాలు కొనుగోలు చేయలేదు. ఇదీ మన దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పే గుజరాత్ లోని పరిస్థితి.

Related posts

సుఖ భోగాలకు మార్గం సౌభాగ్యాలకు ద్వారం

Satyam NEWS

మేం పెట్టిన స్కీమ్ కు పేరు మార్చి చెబుతున్నారు

Satyam NEWS

ఏలూరు మునిసిపల్ వర్కర్లను పర్మినెంటు చేయాలి

Satyam NEWS

Leave a Comment