28.7 C
Hyderabad
April 20, 2024 06: 04 AM
Slider కరీంనగర్

పేదలను దోచుకుంటున్న పిల్లల వైద్యులు

#AmruthaHospital

కనిపించని దేవుళ్లకు ఎవరైనా మొక్కుతారో లేదో కానీ కనిపించే దేవుళ్లు మాత్రం వైద్యులే. వారిని మాత్రం కులమతాలకు అతీతంగా వైద్య నారాయణులుగా కీర్తిస్తుంటారు.

నిజంగానే దేవుని కంటే గొప్ప వారు వైద్యులు. కానీ రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల వైద్యుడు మాత్రం కాసుల కమీషన్ల కక్కుర్తితో పసి ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స పేరుతో  అందికాడికి దోచుకుంటూ నిరుపేదలను రోడ్డున పడేస్తున్నాడు.

ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లో నడుస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా లోని ఒక ఆసుపత్రి లో పసిపిల్లల ప్రాణాలతో చికిత్స పేరుతో వ్యాపారం చేస్తూ, నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా రోడ్డున పడేలా కమీషన్ల కోసమే కరీంనగర్ కు తరలించి వైద్య వృత్తికే కళకం తెస్తున్నాడని భాదితులు ఆరోపిస్తున్నారు.

దోచుకునే డాక్టర్ కు అధికార పార్టీ అండ

అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో వైద్యుడి దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయాయి.  ప్రసూతి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందులను పరీక్షించి పాపను లేట్ చేయకుండా త్వరగా తన ఆసుపత్రికి తీసుకురావాలని జాగ్రత్తలు చెప్పి అమృత పిల్లల ఆసుపత్రికి తరలించుకుంటాడు అక్కడి డాక్టర్.

గంట రెండు గంటలు చికిత్స చేసినట్టు చేసి పాప కండీషన్ సీరియస్ గా ఉంది. వెంటనే కరీంనగర్ కు తరలించాలి, లేకుంటే పాప ప్రాణానికే ప్రమాదం అని పసికందు బంధువులకు లేని సమస్యలు ఉన్నట్లు భయబ్రాంతులకు గురిచేయడం, కరీంనగర్ లో కూడ చాలా మంది పిల్లల డాక్టర్లకు ఫోన్ చేసినా ఎవరూ కూడా ఈ కండిషన్ లో చేర్చుకోమని చెబుతున్నారని, మా ఫ్రెండ్ ఆసుపత్రి ఉంది అతను చాలా మంచి డాక్టర్ నేను చెప్పాను కాబట్టి చేర్చుకుంటాడు.

వెంటనే వెంటిలేటర్ పెట్టి తరలించాలి, మా కంపౌండర్ ను ఇచ్చి పంపుతాను , మీరు ఎంత లేట్ చేస్తే పాపకు అంత ప్రమాదం అంటూ భయాందోళనలకు గురి చేస్తాడు.

కూడబెట్టుకున్న సొమ్మంతా దోచేస్తున్నారు

దీంతో అర్దరాత్రి ఎటు పోవాలో, ఏం చేయాలో తెలియని పాప బంధువులు వైద్యని పైనే భారం వేసి కాళ్లా వేళ్లా పడడంతో,  ఒక రోజు ఉంచుకుని పంపిస్తాడని సాయంత్రం వరకు పాప మెరుగవుతుందని గ్యారంటీ …. నన్ను నమ్మండి అని నమ్మ బలికి పసికందులను తరలింపజేసుకుంటాడు.

అసలే నిరుపేదలు, రూపాయి రూపాయి కూడబెట్డుకుని భయపడుతూనే కనిపించని దేవుళ్లను, వైద్యులే దేవుళ్లను కుంటూ ఆసుపత్రులకు వచ్చే ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నాడు. పసిప్రాణాలతో వ్యాపారం చేసే ఆ వైద్యుడు తన కాసుల కమీషన్ల కోసం తను చదివింది ఎండి అయినా తన కన్నా తక్కువ చదువుకున్న ఎంబిబిఎస్ డిసిహెచ్ వైద్యుని గా చేస్తున్న కరీంనగర్ లో ఒక ఆసుపత్రికి ఫోన్ చేసి పసికందులను అడ్మిట్ చేయిస్తాడు.

సీరియస్ అని చెబుతారు దోచేస్తారు

మొదటి లేదా రెండవ రోజు పాప ప్రాణం చాలా సీరియస్ గా ఉందని, చాలా డబ్బులు ఖర్చవుతాయని పసికందుల బంధువులను మానసికంగా ప్రపేర్ చేస్తారు. దీంతో వారు అందిన కాడికి అప్పులు చేస్తూ రోజు వారిగా బిల్లులు చెల్లిస్తూ పాప అరోగ్య పరిస్తితిని తెలుసుకుంటూ కనిపించని దేవుళ్లనూ…… కనిపించే ఈ దేవుళ్లకూ దండం పెడుతూనే పసిపాప ప్రాణాల కోసం పరితపిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎప్పుడైతే బాదితులు డబ్బులు కట్టని పరిస్థితి గమనించిన ఆసుపత్రి యాజమాన్యం వారిని బయటకు పంపేందుకు మళ్లీ సీరియస్ అంటూ మొదటి అమృత హాస్పిట్ డాక్టర్ చెప్పినట్టుగానే హైదరాబాద్ కు తరలించాలి నలుగురు, ఐదుగురు డాక్టర్లకు పోన్ చేస్తే ఒక్కరు ఒప్పుకున్నారు.

పాప కండిషన్ మాత్రం సీరియస్ ఎంత తొందరగా తరలిస్తే అంత తొందరగా ప్రాణాలతో పాప బయట పడుతుందని వైద్యడి తో పాటు సిబ్బంది సూచనలిస్తారు.

గత్యంతరం లేని ఆ అమాయకులు హైదరాబాద్ లాంటి కార్పోరేట్ ఆసుపత్రులకు పోలేక చేతిలో చిల్లి గవ్వలేక నానా యాతన పడుతూ ఆసుపత్రుల‌చుట్టూ తిరిగి వేసాగుతున్నారు. కమీషన్ల కక్కుర్తితో పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు వైద్యుని చెరలో చిక్కి ఆర్థికంగా చితికిన కుటుంబాలు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి.

 ఇవన్నీ తెలిసినా కూడా వైద్య శాఖాధికారులు మాత్రం చూసీ చూడనట్లుండడం శోచనీయం. అసలే అధికారపార్టీ అండదండలున్న యాజమాన్యం దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం తో నిరుపేదలను నిండాముంచుతున్న వైద్యుడి వైద్యపట్టా రద్దు చేసి పేద ప్రజల పసిప్రాణాలను కాపాడి వారి కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా చూడాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కరోనా ఫియర్: నిర్మల్ పట్టణంలో హైఎలర్ట్

Satyam NEWS

Professional Is Hemp Oil Different Than Cbd Oil Hemp Cbd Oil 7 Cinnamon

Bhavani

మనల్ని వదిలి వెళ్లిపోయిన జర్నలిస్టు సురేష్

Satyam NEWS

Leave a Comment