38.2 C
Hyderabad
April 25, 2024 12: 50 PM
Slider వరంగల్

బాల్య వివాహాలు, లైంగిక దాడులపై అవగాహన

Child Marriages

శుక్రవారం ICDS ప్రాజెక్ట్ ములుగు మండలానికి చెందిన జగ్గన్నపేట గ్రామంలో అంగన్వాడీ టీచర్లతో సెక్టార్ మీటింగ్ నిర్వ‌హించారు.

ICDS కోడిసెలకుంట సూపర్ వైజర్ అరుణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐసిపిస్ టీమ్ సోషల్ వర్కర్ జ్యోతి, అవుట్ వర్కర్ రాజు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సోషల్ వర్కర్ జ్యోతి మాట్లాడుతూ ములుగు జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా నిలపాలనే జిల్లా కలెక్టర్ లక్ష్యానికి అనుకూలంగా, గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలు, నిరాదరణకు గురవుతున్న బాలలు, బడి బయటి బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహాలకు గురయ్యే అవకాశమున్నబాలలు, అక్రమ దత్తతకు గురైన బాలలు ఇలా వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్న 0-18 సంవత్సరాల గ్రామస్థాయిలో బాలల హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నబాలలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశంలో పాల్గొన్నఅంగన్వాడీ టీచర్లకు తెలిపారు.

మహిళలు, అలాగే బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా181, 1098 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులు అందించవచ్చని సూచించారు. అదేవిధంగా ప్రతి నెలలో తీసుకునే 15 రోజుల రిపోర్టు తీసుకుని, ప్రతి గ్రామంలో 0 నుండి 18 సంవత్సరాల బాలలందరికీ సర్వే నిర్వహించాలని సర్వే ఫార్మర్స్ అందజేశామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ, అవుట్ వర్కర్ రాజు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

Related posts

23 నుంచి హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..

Satyam NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బందికి వైద్య శిబిరం

Satyam NEWS

హుమాన్ రైట్స్ కౌన్సిల్ రంగారెడ్డి అధ్యక్షుడుగా రామ్మోహన్

Satyam NEWS

Leave a Comment