కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకూ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. స్వామి వారి ఆరాధన రోజూ జరుగుతుంది కానీ భక్తులకు అనుమతి లేదని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్ సినిమా హాళ్లు మూసి వేసిన విషయం తెలిసిందే.
వివాహాది శుభ కార్యాలు కూడా అతి తక్కు మందితో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలు సమావేశాలు కూడా నిలిపివేశారు. వాటన్నింటి దృష్ట్యా చిలుకూరు బాలాజీ దేవాలయం నిర్వాహకులు కూడా దేవాలయాన్ని భక్తులకు ప్రవేశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.