34.2 C
Hyderabad
April 23, 2024 11: 39 AM
Slider ప్రపంచం

శ్రీలంకలో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

డ్రాగన్ దేశం పలు రంగాల్లో సాయం అందిస్తుందని శ్రీలంక ఆశించింది. అయినప్పటికీ ఎలాంటి హామీలు లేకుండానే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శ్రీలంక పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో చైనా నుంచి పలు విషయాలపై వాగ్దానాలు కూడా రాకపోవడం ద్వీప దేశ నాయకులను కలవరపెడుతోంది.

వాంగ్ యీ వారం రోజుల ద్వీప దేశాల పర్యటనలో ప్రధానంగా శ్రీలంకకు కలిసివస్తుందని భావించారు. అయినప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకకు ఆర్థిక చేయూత.. కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాయం ప్రకటను ఉంటుందని శ్రీలంక భావించింది. అయినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి ఎలాంటి వాగ్ధానాలు కనిపించలేదు.

అయితే బీజింగ్, ఎఫ్‌డిఐకి $5 బిలియన్ల లంక రుణాన్ని పునర్నిర్మించే హామీ రూపంలో బహుమతులు అందించనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతోపాటు శ్రీలంక – చైనా ప్రాయోజిత మెగా ప్రాజెక్ట్‌లతో సహా ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం లభిస్తుందనుకున్న అలాంటి హామీలు లభించకపోవడం ద్వీపదేశాన్ని కలవరపెడుతోంది.

భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతూనే డ్రాగన్ కంట్రీ వేరే దేశాలను ఆకట్టుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా కరోనాతో ఆర్ధిక మాంద్యంలో కూరుకున్న శ్రీలంకకు చేయూత అందించకపోవడం భారత్‌కు కలిసివచ్చే విషయంగా మారనుంది.

చైనీస్ పర్యాటకులను శ్రీలంకను సందర్శించేలా ప్రోత్సహించాలని, రాయితీతో కూడిన వాణిజ్య క్రెడిట్ వ్యవస్థ కోసం, తక్షణ చెల్లింపు లేకుండా శ్రీలంక క్లిష్టమైన సామాగ్రిని దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించాలని శ్రీలంక అధ్యక్షుడు చేసిన అభ్యర్థనకు కూడా వాంగ్ నుండి తక్షణ ప్రతిస్పందన రాలేదు.

Related posts

విజయనగరంలో రెడ్ క్రాస్ సొసైటీ వందేళ్ల పండుగ

Satyam NEWS

బోధన్ ఎమ్మెల్యే బిజెపిలోకి జెంప్?

Satyam NEWS

కరోనా హెల్ప్:నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం

Satyam NEWS

Leave a Comment