మహాత్మా గాంధీ 150వ జయంతిని జరపకుండా అడ్డుకున్న చైనా ఆయనను దారుణంగా అవమానించింది. మహాత్ముడి జయంతిని ప్రతి ఏటా అక్టోబర్ 2వ తేదీన బీజింగ్ లోని ఛోయాంగ్ పార్క్ లో నిర్వహించేవారు. దశాబ్ద కాలం పైగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మహాత్మా గాంధీ విగ్రహం అక్కడ ఒక్క చోటే ఉండటం వల్ల ఆయన జయంతిని అక్కడే నిర్వహించేవారు. ఆ పార్క్ లోని జితాయ్ ఆర్ట్ మ్యూజియం లో సభా కార్యక్రమాన్ని నిర్వహించుకునేవారు కాగా ఈ సారి అక్కడ సభ నిర్వహించే వీలు లేదని జితాయ్ ఆర్ట్ మ్యూజియం భారత రాయబార కార్యాలయానికి సమాచారం పంపింది. మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారో కారణం చెప్పలేదు. ఈ పార్క్ మొత్తం నేరుగా చైనా ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించరాదని తమకు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని అందువల్ల రద్దు చేస్తున్నామని ఆర్ట్ మ్యూజియం అధికారులు భారత రాయబార కార్యాలయానికి వెల్లడించారు. చేసేదేమి లేక భారత రాయబార కార్యాలయం గాంధీ జయంతిని తమ కార్యాలయ ప్రాంగణంలోనే జరిపారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన కళాకారులు వేసిన గాంధీ చిత్రపటాలను చైనాలోని భారత రాయబారి మిశ్రి ఆవిష్కరించారు. మహాత్మా గాంధీకి రాయబార కార్యాలయం సిబ్బంది నివాళి అర్పించారు
previous post
next post