27.7 C
Hyderabad
April 24, 2024 08: 41 AM
Slider ప్రపంచం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమతమైన దేశం చైనా

#chinamilitary

మొత్తం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సైనికబలం ఏ దేశానికి ఉంది? ఠక్కున అమెరికా అని చెప్పేయవద్దు. ఎందుకంటే ఆ పరిస్థితి మారిపోయింది.

ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిగల దేశంగా చైనా ఆవిర్భవించింది. అమెరికా రెండో స్థానానికి పడిపోయింది.

మిలిటరీ డైరెక్ట్ అనే రక్షణ రంగ వెబ్ సైట్ ప్రపంచంలోని వివిధ దేశాల సైనిక బలాన్ని లెక్కేసి పాయింట్లు ఇచ్చింది. అలా చైనా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది.

అమెరికా రెండో స్థానంతో సరిపెట్టుకోగా మూడో స్థానంలో రష్యా వచ్చింది. సంతోషించదగిన పరిణామం ఏమిటంటే నాలుగో స్థానానికి భారత్ చేరుకున్నది.

ఐదో స్థానంలో ఫ్రాన్స్, ఆ తర్వాత బ్రిటన్ ఉన్నాయి.

వివిధ దేశాలు రక్షణ కోసం వెచ్చిస్తున్న బడ్జెట్, చురుకుగా ఉన్న మిలిటరీ దళాల సంఖ్య, వాయుసేన, నావికాదళం, సైనికబలం, అణ్వాయుధాలు, ఇతర రక్షణ పరికరాలు అన్నింటిని లెక్కించి ‘‘అల్టిమేట్ మిలటరీ ఇండెక్స్’’ తయారు చేశారు.

అందులో పాయింట్లు ఇవ్వగా చైనా మొదటి స్థానానికి చేరుకున్నట్లు స్పష్టంగా కనిపించింది.

Related posts

జగన్ సిద్ధం: ముందస్తు ఎన్నికలు తథ్యం

Bhavani

నందలూరు లో రాయల సీమ ఎక్స్ ప్రెస్ నిలుపుదల కు వినతి

Satyam NEWS

రానా విరాట ప‌ర్వం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

Leave a Comment