27.7 C
Hyderabad
March 29, 2024 03: 11 AM
Slider సంపాదకీయం

భారత్ వ్యాక్సిన్ పై దుష్ట చైనా కుట్రలు బట్టబయలు

#CorinaVaccine

లద్దాక్ లో భారత సైన్యంతో పోరాడటమే కాదు, దుష్ట చైనా, భారత్ ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నది. భారత్ సృష్టించిన కరోనా వ్యాక్సిన్ పై దేశంలోనూ, అంతర్జాతీయంగా కూడా అభద్రతాభావం పెచ్చరిల్లేలాగా చైనా పథకాలు రచిస్తున్నది.

ఈ జులై నాటికి కనీసం 30 కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందచేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం జనవరి 16న ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే దాదాపుగా అమెరికా జనాభా అంత మందికి భారత్ లో కరోనా వ్యాక్సిన్ అందచేస్తారన్నమాట.

కంట్లో నిప్పులు పోసుకుంటున్న చైనా

మరి ఇంత పెద్ద కార్యక్రమం సజావుగా జరిగితే ఎలా అంటూ చైనా కంట్లో నిప్పులు పోసుకుంటున్నది. చైనా సృష్టించిన వైరస్ తో ఇప్పటికి చాలా దేశాలు పోరాడుతుండగా, భారత్ అజేయంగా నిలిచి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా రూపొందించి ప్రజలకు అందచేస్తున్నది.

తన ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా సాటి దేశాలలోని ప్రజల కు కూడా కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరో బృహత్ ప్రణాళిక రూపొందించి పొరుగు దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి చైనా మీడియా వివిధ రకాలైన అపోహలను అంతర్జాతీయ మార్కెట్ లోకి వదులుతున్నది.

క్లినికల్ ట్రయల్స్ పై చెడు ప్రచారం

భారత్ కరోనా ను సమర్ధవంతంగా కట్టడి చేయలేకపోయిందని, అలాంటి దేశం ఇప్పుడు వ్యాక్సిన్ ను ఇస్తామంటున్నదని చైనా మీడియా దుమ్మెత్తి పోస్తున్నది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి కాకుండానే భారత్ తన వ్యాక్సిన్ ను విడుదల చేసిందని కూడా చైనా చెబుతున్నది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటా అందుబాటులో లేదని చైనా మీడియా విమర్శలు గుప్పిస్తున్నది. చైనా చేస్తున్న విమర్శలతో ప్రపంచంలోని చాలా దేశాలు భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.

మాస్కులు, పీపీఈ కిట్లు కూడా అమ్ముకున్న దుష్ట చైనా

వ్యాక్సిన్ లకు హబ్ అయిన భారత్ ను కరోనా వ్యాక్సిన్ విషయంలో అడ్డుకోవడానికి చైనా అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నది. వైరస్ ను సృష్టించిన చైనా కరోనా వచ్చిన కొత్తలో మాస్కులు, పిపిఇ కిట్లు కూడా అమ్ముకున్నది.

ఇప్పుడు వ్యాక్సిన్ అమ్ముకోవాలని శతవిధాలా ప్రయత్నింస్తుంటే భారత్ రూపొందించిన చౌకైన వ్యాక్సిన్ చైనా ఆదాయానికి గండి కొడుతున్నది. దాంతో చైనా తన మీడియాను ఉపయోగించి కల్పితగాధలు ప్రచారం చేయిస్తున్నది. చైనా రూపొందించిన సినోవాక్ 75 శాతం మేరకు సమర్థమైనదని చైనా నమ్మకంగా చెప్పి బ్రెజిల్ కు పెద్ద ఎత్తున అమ్ముకున్నది.

అయితే బ్రెజిల్ లో చైనా వ్యాక్సిన్ ను ప్రయోగించి చూడగా కేవలం 50 శాతం మాత్రమే సామర్ధ్యం ఉన్నట్లు వెల్లడి అయింది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చైనా వ్యాక్సిన్ కు డిమాండ్ రోజు రోజుకు తగ్గిపోతున్నది.

ఈ కారణంగా భారత్ తన అంతర్జాతీయ మార్కెట్ ను ఎక్కడ కైవసం చేసుకుంటుందోననే భయంతో చైనా చెడు ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నది. చైనా భయాలకు తగ్గట్టుగానే భారత్ కు దాదాపుగా 60 దేశాల నుంచి కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు స్వీకరించింది.

అత్యంత సమర్ధత   ప్రదర్శించిన భారత్

దేశంలో 700 జిల్లాల్లో అతి తక్కువ సమయంలోనే 1.5 లక్షల మంది సిబ్బందికి శిక్షణనిచ్చి భారత్ కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందచేయడమే కాకుండా 29 వేల కోల్డ్ చైన్ పాకెట్లను అతి స్వల్ప కాలంలో అభివృద్ధి పరచడం చైనాను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ కోల్డ్ చైన్ పాకెట్లలో కరోనా వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున నిల్వచేసి దేశం నలుమూలలకు పంపుతున్నారు. అంతే కాకుండా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే పక్క దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున సరఫరా చేయడం ప్రారంభించారు.

ఈ విధంగా భారత దేశంలో జరగడం చైనా ను ఆశ్చర్య పరుస్తున్నది. ఇంత సమర్ధంగా భారత్ ప్రవర్తించడం చైనా మార్కెట్ ను పూర్తిగా దెబ్బతీస్తున్నది.

అందుకే తన మీడియాను, మోడీ వ్యతిరేకులను ప్రోత్సహించి మరీ భారత్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ పై పూర్తి స్థాయిలో బురద చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నది. అయితే దుష్ట చైనా కుట్రలను భారత్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, www.satyamnews.net

Related posts

తుపాన్ బాధితులను ఆదుకోవాలి

Sub Editor

ప్రభుత్వ విధానంలో మార్పు చేయమని కోరకూడదు

Satyam NEWS

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై దిద్దుబాటు చర్యలు

Satyam NEWS

Leave a Comment