27.7 C
Hyderabad
April 26, 2024 03: 49 AM
Slider ఆధ్యాత్మికం

చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

#TirumalaBrahmostavalu

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Related posts

ఓ దిశ నువ్వెక్కడ: జీవోలు ఇవ్వడమే తప్ప ఆచరించడం శూన్యం

Satyam NEWS

మానవత్వంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ రివార్డు

Satyam NEWS

తెలంగాణలో వ్యవసాయం కు పెద్దపీట

Bhavani

Leave a Comment