ఎంఐఎం నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడి వివాహ వేడుక బుధవారం రాత్రి యూసుఫ్‌గూడ పోలీసు మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రేస్, భాజపా, తెదేపా పార్టీల నేతలు, పలువురు సినీ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు విచ్చేశారు.
ఈ సందర్భంగా చిన శ్రీశైలం యాదవ్ రెండవ కుమారుడు ప్రవీణ్‌కుమార్ యాదవ్, మజితశ్రీ దంపతులను అతిధులు ఆశీర్వదించారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన అతిథులకు చిన శ్రీశైలం యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. వివాహ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
