34.2 C
Hyderabad
April 19, 2024 22: 30 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన చైనా

#ChinaForeignMinistry

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను చైనా అభినందించింది. భారత్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నదని, దాన్ని ఎదుర్కొనడానికి పాకిస్తాన్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియన్ జుహో అభినందించారు.

అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ తో కలిసి పని చేస్తామని లిజయన్ జుహో తెలిపారు. చైనా పాకిస్తాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) ని అడ్డుకోవడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చేసిన ప్రకటనను చైనా పూర్తిగా సమర్థించింది.

పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో భారత్ ప్రమేయం ఉన్నట్లు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని పాకిస్తాన్ చేసిన ప్రకటనను చైనా పూర్తిగా సమర్థించింది.

Related posts

సరైన వేతనం ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు

Satyam NEWS

సర్వ మతాలకు ప్రాధాన్యతనిచ్చిన సీఎం

Sub Editor

మార్చి మూడో వారానికి విశాఖ నుంచి పాలన?

Bhavani

Leave a Comment