40.2 C
Hyderabad
April 24, 2024 18: 28 PM
Slider పశ్చిమగోదావరి

చింతామణి నాటకాన్ని విజయవంతంగా అడ్డుకున్న ఆర్యవైశ్యులు

#ChintamaniPlay

ఏలూరు జిల్లాలో జరుగుతున్న జాతర ఉత్సవాలలో చింతామణి నాటకం ప్రదర్శించకుండా పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం చర్యలు తీసుకున్నది.

గాలాయ గూడెం, రాట్నాల కుంట ఉత్సవాల్లో చింతామణి నాటకం ప్రదర్శించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్యవైశ్య సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు అందగానే పెదవేగి, తడికలపూడి, దెందులూరు పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు. చింతామణి నాటకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలను చూపించి నిర్వాహకులు చింతామణి నాటకం ప్రదర్శించకుండా చర్యలు తీసుకున్నారు. 

ఆర్య వైశ్య సంఘం వినతి పత్రం సమర్పించడంతో దెందులూరు MRO కూడా తక్షణమే స్పందించారు. తగిన చర్యలు తీసుకుని చింతామణి నాటకాన్ని నిలుపుదల చేయించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కోనా శ్రీనివాసరావు, కామవరపుకోట మండలం, దెందులూరు మండలం, పెదవేగి మండలానికి చెందిన ఆర్య వైశ్య సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.

Related posts

రెబెల్ వాయిస్: వైసీపీలో మరో ధిక్కార స్వరం

Satyam NEWS

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తెలంగాణ‌వాసుల‌ను సుర‌క్షితంగా తీసుకురావాలి

Satyam NEWS

మెటర్నిటీ హెల్త్ అవార్డు గ్రహీతలకు అభినందన

Bhavani

Leave a Comment