27.7 C
Hyderabad
March 29, 2024 01: 28 AM
Slider ఆధ్యాత్మికం

రేపటి నుంచి చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

#chintarevula

భక్తుల కొంగుబంగారంగా కొలవబడుతూ, కోరిన కోర్కెలు తీర్చే గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 24నుంచి 31వ రకు కొనసాగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేసి భక్తుల వస తుల కల్పన ఏర్పాట్లను చేపట్టారు.

ఈ ఉత్సవాలకు తెలంగాణ వాసులేకాక ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు తీర్చుకుంటారు. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యే భక్తులు స్వామి వారికి తలనీలాలు, దాసంగ నైవేద్యాలు, కాయకర్పూరాలతో తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వసతి సౌకర్యం, క్యూలైన్ల ద్వారా దర్శన సౌకర్యం వంటి ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.

బ్రహ్మోత్సవాల వివరాలు

ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగం గా 24న ఉత్సవాల అంకురార్పణ, ధ్వజారోహణం, 25న తెప్పోత్సవం, పల్లకిసేవ, ప్రభొత్సవం, 26న గురువారం రథోత్సవం, 27న ప్రభోత్సవం, 28న అవభృతసాన్నము, 29న బిష్మాష్టమి,30న మధ్య నవమి, 31న పల్లకిసేవ, స్వస్తివచనముతో ఉత్స వాలు ముగుస్తాయని ఆలయ చైర్మన్‌ శేషగిరి రావు, ఈవో కవిత తెలిపారు.

Related posts

బిచ్కుందలో మార్కండేయ జయంతి వేడుకలు

Satyam NEWS

మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య

Satyam NEWS

ఆది సాయికుమార్ చేతుల మీదుగా ‘నాతో నేను’ సాంగ్ లాంచ్

Bhavani

Leave a Comment