32.7 C
Hyderabad
March 29, 2024 10: 48 AM
Slider వరంగల్

మితిమీరిన ఆగడాలు చేస్తున్న వరంగల్ చిట్ కంపెనీలు

#warangalrlystation

వరంగల్ లో చిట్ ఫండ్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. చిట్ ఫండ్ యాజమాన్యాలతో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మూడు నాలుగు రోజుల క్రితమే మీటింగ్ పెట్టి మరీ చెప్పినా కూడా చిట్ ఫండ్స్ దౌర్జన్యాలు ఆగడం లేదు. చిట్టీ ఎత్తుకున్నా డబ్బులు ఇవ్వడానికి సంవత్సరాలు అవుతున్నాయి.

ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్ల కుటుంబ సభ్యులతో ధాడులు చేయిస్తున్నారు. హన్మకోండలోని అచలా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టిన రాజు అనే వ్యక్తి తన చిట్టీ ఎత్తుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద నిన్న ఆందోళనకు దిగాడు. అది  మనసులో పెట్టుకున్న అచలా చిట్ ఫండ్ యాజమాన్యం చిట్టీ ఏజెంట్ భార్యతో అతని షాపు పైన అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించింది.

ఈ సంఘటనలో  రాజు సెల్ ఫోన్ షాపు దగ్దమవగా  రాజు పైన కూడా పెట్రోల్ పోసి అంటించడంతో రాజు కూడా  కాలిపోయాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆర్పే ప్రయత్నం చేయగా ఎదురుగా ఉన్న పాన్ షాపు యజమాని రంగయ్య కూడా గాయాలపాలయ్యాడు.  ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Related posts

కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్నిఏర్పాటు చేయాలి

Sub Editor

హిందువుల ధర్మానికి చిహ్నం అయోధ్య రామమందిరం

Satyam NEWS

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను సమైక్యంగా ఎదుర్కోవాలి

Satyam NEWS

Leave a Comment