24.7 C
Hyderabad
February 10, 2025 22: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్

చిత్తూరు మాజీ ఎంపి శివప్రసాద్ మృతి

Naramalli-Sivaprasad1569058171

టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్‌ చేస్తున్నారు. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2006లో ‘డేంజర్‌’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.  అనంతరం రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన రోజుకో వేషం వేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో శివప్రసాద్‌ తన నిరసన తెలిపేవారు. శివప్రసాద్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నిన్న శివప్రసాద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించారు. ఆయన లేని లోటు తెలుగుదేశానికి తీరేది కాదని చంద్రబాబునాయుడు అన్నారు. t 2;\l

Related posts

జగిత్యాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Satyam NEWS

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

బిజెపి కార్యకర్తలపై పోలీసుల తీరు పట్ల ఖండన

Satyam NEWS

Leave a Comment