క్రిస్మస్ వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫీస్ట్-2019 లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పేద క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు, దుస్తుల పంపిణి చేశారు. ప్రేమ విందు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సిఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అన్ని కులాలకు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సెక్యూలర్ ప్రభుత్వం తమది అని అన్నారు. అన్ని మతాలు, వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
క్రిస్టియన్ సోదరుల ఆత్మ గౌరవం నిలిపే విధంగా ప్రభుత్వం హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేస్తున్నదని ఆయన తెలిపారు. క్రైస్తవుల కోసం ఓవర్ సీస్ స్కాలర్ షిప్, ఒన్ యువర్ కార్, స్కాలర్ షిప్ లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ట్, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పాపలాల్, పాస్టర్లు జాన్ కాంతారావు, కార్పొరేటర్లు పగడాల నాగరాజ్, చావా నారాయణ రావు, Rjc కృష్ణ తదితరులు పాల్గొన్నారు.