కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో క్రిస్మస్ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే క్రైస్తవ సోదరిమణులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల వారు ఆత్మ గౌరవంతో పండుగ చేసుకుని ఆనందాలతో గడపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ క్రిస్మస్ పండుగలకు కానుకల పేరిట వస్త్రాలను రంజాన్ పండుగలకు మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు వస్త్రాలను కూడా ప్రభుత్వం అందిస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నదే కెసిఆర్ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, మత పెద్దలు అమృతరాజ్ శైలేష్ సామిల్ డేవిడ్ క్రైస్తవ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.