28.2 C
Hyderabad
April 20, 2024 14: 33 PM
Slider వరంగల్

క్రిష్టియన్ మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట

satyavathi 19

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసి, పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మంత్రి స్థానిక డిఎల్ఆర్ గార్డెన్ లో క్రిస్మస్ పండుగ వేడుకల్లో భాగంగా క్రిస్టియన్ లకు దుస్తుల పంపిణీ చేశారు.

క్రిస్మస్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరూ కుల మతాలకతీతంగా సంతోషంగా ఉండాలన్నది ప్రభుత్వ అభిమతమని అన్నారు. పేదవారు ఉన్నవారిలాగా పండుగలకు క్రొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉండాలని, ప్రభుత్వం బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వం దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు.

విద్య చాలా అవసరమని, విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రామంతాపూర్ లో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్ లో రూ. 40 కోట్లతో సేవాలాల్ భవన్, కొమురం భీమ్ భవన్ లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

క్రిస్టియన్, మైనారిటీలకు స్కాలర్ షిప్, విదేశాల్లో చదువుకొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ, నూతన జిల్లా ములుగు జిల్లాపై ఏసు ప్రభువు కరుణా కటాక్షం చూపాలని, జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు. 

కార్యక్రమంలో పాల్గొన్న  ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా చేసుకొనే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. ప్రభుత్వం పేదవారు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ప్రభుత్వం దుస్తుల పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ మాట్లాడుతూ, సమాజంలో అందరూ సమానులేనని అన్నారు. ప్రభుత్వ ఫలాలు ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ అందాలని అన్నారు.   కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరిసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, మైనారిటీ స్కూళ్ల లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని, వెనుకబడిన ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు,జిల్లా క్రిస్టియన్ కమిటీ అధ్యక్షులు సుదర్శన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్ బిల్లులపై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

Satyam NEWS

విద్యుత్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన జేఏసీ

Satyam NEWS

ప్రజల జీవితాల్లో భోగా భాగ్యాలు కొత్త కాంతి రావాలి

Satyam NEWS

Leave a Comment